రోడ్డు ప్రమాదంలో స్టార్ సింగర్ మంగ్లీకి గాయాలు.. అసలు ఏం జరిగిందంటే?

by Disha Web Desk 6 |
రోడ్డు ప్రమాదంలో స్టార్ సింగర్ మంగ్లీకి గాయాలు.. అసలు ఏం జరిగిందంటే?
X

దిశ, సినిమా: స్టార్ సింగర్ మంగ్లీ కారుకు యాక్సిడెంట్ అయినట్లు సమాచారం. శంషాబాద్ తొండుపల్లి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే మంగ్లీకి ప్రమాదం తృటిలో తప్పినట్లు తెలుస్తోంది. ఆమె కారును ఓ డీసీఎం వాహనం ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. దీనికి కారణం డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం.

రంగారెడ్డి జిల్లా నందిగామ కన్హ ఆధ్యాత్మిక మహోత్సవానికి హాజరై తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలిసిన ఆమె అభిమానులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆమె కారు భారీగా డ్యామేజ్ అయినట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని ఆస్పత్రికి తరలించారు. కాగా, మంగ్లీ ప్రస్తుతం సూపర్ సింగర్ షోలో జడ్జిగా వ్యవహరిస్తూనే పలు ప్రైవేట్, సినిమా పాటలు పాడుతూ ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటుంది.

Read More..

స్విమ్మింగ్ ఫూల్‌లో రెచ్చిపోయి అతనితో ఆ పని కానిచ్చేసిన పూజా.. పబ్లిక్‌లో ఇవేం పనులంటూ తిట్టిపోస్తున్న నెటిజన్...






Next Story

Most Viewed