ట్విట్టర్ హ్యాష్‌ట్యాగ్ కోసం కొట్టుకుంటున్న స్టార్ హీరోలు.. హాట్ టాపిక్‌గా మారిన వ్యవహారం!

by Mallepaka Hamsa |   (  Updated:2025-08-04 09:11:33  IST  )

మ్యాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan) ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వార్-2’(War-2).

ట్విట్టర్ హ్యాష్‌ట్యాగ్ కోసం కొట్టుకుంటున్న స్టార్ హీరోలు.. హాట్ టాపిక్‌గా మారిన వ్యవహారం!
X

దిశ, సినిమా: మ్యాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan) ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వార్-2’(War-2). అయాన్ ముఖర్జీ (Ayan Mukherjee)దర్శరత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ కియారా అద్వానీ(Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ ‘వార్’కు సీక్వెల్‌గా తెరకెక్కుతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్ని భారీ అంచనాలను పెంచేశాయి.

షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ ఆగస్టు 14న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈక్రమంలో.. తాజాగా, సోషల్ మీడియాలో ఓ వార్ నడుస్తోంది. ట్విట్టర్ హ్యాష్‌ట్యాగ్ కోసం ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కొట్టుకున్నంత చర్చ కొనసాగుతోంది. మరో పది రోజుల్లో ‘వార్-2’ విడుదల కాబోతుండటంతో తన పేరు ముందు ఉండేలా హృతిక్ vsఎన్టీఆర్ ఈ హ్యాష్‌ట్యాగ్‌ను వాడాలని హృతిక్ రోషన్ అంటున్నారు. కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం తన పేరు ముందు ఉండాలని చెప్పుకొస్తున్నారు.

హృతిక్ రోషన్ దీన్ని కాంప్లికేట్ చేయకు అంటూ ఎన్టీఆర్‌కి చెప్పగా.. తారక్ మనిద్దరం డిస్కస్ చేద్దాం కానీ హ్యాష్ ట్యాగ్ మాత్రం నా పేరు ముందుడేలా అప్డేట్లు ఇద్దాం ఇప్పుడే వార్ స్టార్ట్ అయింది అని రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం వీరిద్దరి ట్విట్టర్ పోస్టులు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇదంతా సరదాగా సాగుతున్నట్లు ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మాత్రం ఇది ఏమైనా కాంప్లికేట్ అవుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు.

link

Read More..

నాగార్జున విలన్‌గా చేస్తారని ఊహించలేదు.. ఆయనలా నేను కూడా నటించలేనంటూ సూపర్ స్టార్ షాకింగ్ కామెంట్స్

Next Story