- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాగార్జున విలన్‌గా చేస్తారని ఊహించలేదు.. ఆయనలా నేను కూడా నటించలేనంటూ సూపర్ స్టార్ షాకింగ్ కామెంట్స్
రజినీకాంత్(Rajinikanth), లోకేష్ కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కూలీ’(coolie). ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.

దిశ, సినిమా: రజినీకాంత్(Rajinikanth), లోకేష్ కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కూలీ’(coolie). ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఇందులో శృతి హాసన్, ఉపేంద్ర, నాగార్జున(Nagarjuna), సౌబిన్ షాహిర్, పూజా హెగ్డే, ఆమిర్ ఖాన్(Aamir Khan) కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మూవీ మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇక ఇందులో రజినీకాంత్ హాజరు కానప్పటికీ ఓ వీడియోను రిలీజ్ చేశారు.
‘‘17 రోజుల షెడ్యూల్ కోసం ఇద్దరం థాయ్‌లాండ్‌కు వెళ్లాం. అది నా జీవితంలో మర్చిపోను. సైమన్ పాత్రలో నాగార్జున నటన చూస్తుంటే నాకే ఆశ్చర్యమేసింది. బాషా-ఆంటోనీ ఎలాగో కూలీ-సైమన్ అలా ఉంటుంది. ఇక ఇందులో అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక శృతి హాసన్, ఉపేంద్ర, సౌబిన్‌లతో పాటు ఆమిర్ ఖాన్ స్పెషల్ అపియరెన్స్ ఇవ్వనున్నారు. ముఖ్యంగా ఇందులో నాగార్జున విలన్‌గా చేస్తున్నారు. కూలీ సబ్జెక్ట్ విన్న వెంటనే సైమన్ పాత్ర నేనే చేయాలన్న ఆసక్తి కలిగింది. ఆ పాత్ర ఎవరు చేస్తారా అని ఎదురు చూశా.
నాగార్జున చేస్తున్నారని తెలుసుకుని ఆశ్చర్యపోయాను. ఆయన నటన ఫెంటాస్టిక్‌గా ఉంది. ఆయన డబ్బు కోసం సినిమాలు చేసే వ్యక్తి కాదు. ఆయన ఆ అవసరం కూడా లేదు. నాగార్జున విలన్ గా చేస్తారని అస్సలు అనుకోలేదు. ఆయనలా నేను కూడా నటించలేను. కింగ్ ని ఇప్పటికీ మర్చిపోలేను. ఆయన జెంటిల్‌మెన్. నాగ్ నటిస్తుంటే.. నాకే ఇలా నటించగలనా అనిపించింది. సైమన్ పాత్రలో అదరగొట్టారు’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read More..
పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్‌లో ముంబయి కార్మికులు.. షూటింగ్‌లో ఉద్రిక్తత






