ఆగిపోయిన స్టార్ హీరో సోనూసూద్ వాట్సాప్.. ఆవేదన వ్యక్తం చేస్తూ ఇంట్రెస్టింగ్ పోస్ట్

by Disha Web Desk 6 |
ఆగిపోయిన స్టార్ హీరో సోనూసూద్ వాట్సాప్.. ఆవేదన వ్యక్తం చేస్తూ ఇంట్రెస్టింగ్ పోస్ట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో సోనూసూద్ అందరికీ సుపరిచితమే. ఆయన కరోనాలో ఎంతో మంది కూలీ పనులు చేసుకుంటున్న పేదవారికి సహాయం చేసి రియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం పూర్తిగా సినిమాలకు దూరమై.. పలు సేవా కార్యక్రమాలు చేపట్టి ఇబ్బందుల్లో ఉన్న ఎంతో మందికి సహాయం గా ఉంటూ ట్రీట్మెంట్ చేయిస్తున్నాడు.

ఇదిలా ఉంటే.. తాజాగా, సోనూసూద్ వాట్సాప్ ఆగిపోయిందని తెలుపుతూ ఇన్‌స్టా వేదికగా పలు పోస్టులు షేర్ చేశాడు. తన వాట్సాప్ ఏకంగా 36 గంటల పాటు పనిచేయడం లేదని కష్టాల్లో ఉన్నవారంతా తనను వాట్సాప్‌లో కాంటాక్ట్ అవుతారని వారంతా ఇబ్బంది పడతారని సమస్యను పరిష్కరించాలని రాసుకొచ్చాడు. అయినప్పటికీ సమస్య తీరకపోవడంతో వాట్సాప్ వేకప్.. అర్జెంట్‌గా అకౌంట్ బ్లాక్ అయింది. తొందరగా స్పందించి సమస్యను తీర్చండి అని మరో పోస్ట్ పెట్టాడు. ఇక వాట్సాప్ వారు స్పందించడంతో ఆయన మళ్లీ తన అకౌంట్ పనిచేస్తుందని తెలిపాడు. అంతేకాకుండా 6 గంటల్లోనే 1000 మేసేజ్‌లు వచ్చాయని తెలుపుతూ థాంక్స్ చెప్పాడు.

Read More..

బాలీవుడ్ స్టార్‌ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా.. భారీ స్కెచ్ ప్లాన్ చేసిన డైరెక్టర్












Next Story

Most Viewed