BREAKING: ఏబీ వెంకటేశ్వర రావు సస్పెన్షన్ రద్దుపై పిటిషన్.. తీర్పు రిజర్వ్‌ చేసిన ఏపీ హైకోర్టు

by Shiva |
BREAKING: ఏబీ వెంకటేశ్వర రావు సస్పెన్షన్ రద్దుపై పిటిషన్.. తీర్పు రిజర్వ్‌ చేసిన ఏపీ హైకోర్టు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ రద్దు పిటిషన్‌‌పై కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ మేరకు ఇరు పక్షాల వాదలను విన్న ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా ఒకే అభియోగంపై రెండు సార్లు వెంకటేశ్వర రావును ఎలా సస్పెండ్ చేస్తారంటూ క్యాట్ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ మేరకు క్యాట్ ఆదేశాలపై ఏపీ సీఎస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. క్యాట్ ఆదేశాలను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని న్యాయస్థానానికి విన్నవించారు. అయితే, సీఎస్ తరఫున జీఏడీ డిప్యూటీ కార్యదర్శి జయరాం కోర్టులో అఫిడవిట్ సమర్పించారు. ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఉత్తర్వులు ఇవ్వడంలో క్యాట్ పొరబడిందని జయరాం కోర్టుకు తెలిపారు. సరైన కారణాలతోనే ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసిన విషయాన్ని క్యాట్ మరిచిందంటూ అన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు సమ్మర్ వెకేషన్ బెంచ్ తీర్పును రిజర్వ్ చేసింది.

Next Story

Most Viewed