ఉత్తమ్ ఎదుగుదలను ఓర్వలేకనే విమర్శలు: కేఎల్ఎన్ ప్రసాద్

by Shiva |
ఉత్తమ్ ఎదుగుదలను ఓర్వలేకనే విమర్శలు: కేఎల్ఎన్ ప్రసాద్
X

దిశ, తెలంగాణ బ్యూరో : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎదుగుదలను ఓర్వలేకనే బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి విమర్శలు చేస్తున్నారని టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ కేఎల్ఎన్ ప్రసాద్ మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తమ్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఉత్తమ పార్లమెంటేరియన్‌గా పార్లమెంటులో తెలంగాణ వాణిని వినిపించిన ఘనత ఉత్తమ్ కుమార్‌రెడ్డికే దక్కిందన్నారు. ఆస్తులు సంపాదించుకోకుండా, వ్యాపారాలు చేయకుండా నిజాయితీ గల నాయకుడిగా రాజకీయాల్లో కొనసాగుతున్నారని అన్నారు.

ఉత్తమ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మహేశ్వర్‌రెడ్డి ఖబడ్దార్ అని హెచ్చరించారు. మచ్చ లేని రాజకీయ నాయకుడిగా ఎదుగుతూ.. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్‌లో నిజాయితీ గల పరిపాలన అందిస్తుంటే చూచి ఓర్వలేక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే రూ.వందల కోట్లు అభివృద్ధికి ఖర్చు చేసి రాష్ట్ర అభివృద్ధిని తోడ్పడుతున్నారని అన్నారు. మహేశ్వర్‌రెడ్డి ఇకనైనా ఆరోపణలు మాని అభివృద్ధిలో భాగస్వాములు కావాలని హితవు పలికారు. మంత్ర ఉత్తమ్‌పై మళ్లీ ఆరోపణలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.

Next Story