Trending: కాబోయే భార్యకు కిస్ ఇచ్చిన వరుడు.. చితకబాదిన వధువు బంధువులు

by Shiva |
Trending: కాబోయే భార్యకు కిస్ ఇచ్చిన వరుడు.. చితకబాదిన వధువు బంధువులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ రోజుల్లో పెళ్లికి ముందే అన్ని అయిపోతున్నాయి. ప్రీ వెడ్డింగ్ షూటింగ్ పేరుతో వధూవరులు విచ్చలవిడిగా ముద్దులిచ్చుకోవడం, ఒకరినొకరు కౌగిలించుకోవడం చేస్తున్నారు. ఇంకొంచెం ఫాస్ట్ ఉన్నవాళ్లు అయితే.. ఏకంగా లిప్‌లాక్‌లకు కూడ వెనుకాడటం లేదు. ఈ క్రమంలోనే అందుకు భిన్నంగా పెళ్లి మండపంలోనే సంచలన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాపూర్‌లోని ఓ వ్యక్తి తన ఇద్దరు అమ్మాయిల పెళ్లిళ్లు ఒకేసారి చేస్తున్నాడు.

అందులో మొదటి కూతురు పెళ్లి సజావుగా పూర్తి కాగా.. కొద్దిసేపటి తర్వాత మరో కూతురు పెళ్లి తంతు మొదలైంది. ఈ క్రమంలోనే వరుడు, వధువుకు వరమాల వేయగానే సంతోషంలో వధువుకు బహిరంగంగా ముద్దు పెట్టాడు. దీంతో అమ్మాయి తరఫు బంధువులు వరుడు తీరు చూసి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చిన్న గొడవ కాస్త చిలికి.. చిలికి గాలివాన పంచాయితీ పెద్దందైంది. వధువరుల తరఫు బంధువులు పరస్పరం కర్రలతో దాడి చేసుకోగా.. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించించారు.

Next Story

Most Viewed