బాలీవుడ్ స్టార్‌ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా.. భారీ స్కెచ్ ప్లాన్ చేసిన డైరెక్టర్

by Disha Web Desk 7 |
బాలీవుడ్ స్టార్‌ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా.. భారీ స్కెచ్ ప్లాన్ చేసిన డైరెక్టర్
X

దిశ, సినిమా: హనుమాన్ సినిమాతో దర్శకుడు ప్రశాంత్ వర్మ పేరు సినీ ఇండస్ట్రీలో మార్మోగిపోతోంది. ఒక్క సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ సొంతం చేసుకున్న ఈ డైరెక్టర్‌తో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు సైతం ఎదురు చూస్తున్నట్లు టాక్. ఈ క్రమంలోనే ప్రశాంత్ వర్మ బాలీవుడ్‌లో కూడా తన ప్రతాపం చూపించుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ, బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍వీర్ సింగ్ కాంబినేషన్‍లో సినిమా రాబోతున్నట్లు ఇప్పటికే టాక్ వచ్చిన విషయం తెలసిందే.

అయితే.. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ టీమ్ వర్గాల నుంచి అందుకున్న సమాచారం మేరకు అది దాదాపు కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మించనున్నారని టాక్. ఇక ఈ ఏడాదిలోనే ఈ చిత్రం షూటింగ్ మొదలువుతుందని తెలుస్తుండగా.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.



Next Story

Most Viewed