బీజేపీ MP అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదు.. స్పందించిన CM రేవంత్

by GSrikanth |
బీజేపీ MP అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదు.. స్పందించిన CM రేవంత్
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ వేళ హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత వ్యవహారశైలి వివాదాస్పదమైన విషయం తెలిసిందే. పోలింగ్ బూత్‌లోకి వెళ్లి బుర్ఖా వేసుకున్న ముస్లిం మహిళల ఐడీ ప్రూఫ్ చెక్ చేయడం రాష్ట్రంలో పెద్ద దుమారాన్నే రేపింది. దీనిపై ఇప్పటికే మాధవీలతపై నమోదైంది. మలక్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు సెక్షన్ల కింది ఆమెపై కేసు నమోదు అయింది. తాజాగా.. ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. తాను ఇంకా ఆ వీడియో చూడలేదు అని అన్నారు. ముస్లిం ఓట్లను పోలరైజ్ చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఇలాంటివన్నీ ఎమ్ఐఎమ్ అభ్యర్థి అసదుద్దీన్‌ ఓవైసీ విజయానికి దోహదపడతాయని చెప్పారు. దాని వల్ల బీజేపీకి ఎలాంటి ప్రయోజనం ఉండదని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. కేసు నమోదు అయిన అంశంపై మాధవీలత స్పందిస్తూ.. ‘నేను అభ్యర్థిని. చట్ట ప్రకారం ఓటర్ ID కార్డులను తనిఖీ చేసే హక్కు అభ్యర్థికి ఉంటుంది. నేను పురుషుడిని కాదు, స్త్రీని కాబట్టే మరో స్త్రీని చాలా వినయపూర్వకంగా చెక్ చేసేందుకు ప్రయత్నించాను’ అని అన్నారు.

Next Story