Badradi District: ఓటేసిస సెల్ఫీ ఫొటోను వాట్సా‌ప్‌లో షేర్ చేసిన యువకుడు.. కేసు నమోదు చేసిన పోలీసులు

by Shiva |
Badradi District: ఓటేసిస సెల్ఫీ ఫొటోను వాట్సా‌ప్‌లో షేర్ చేసిన యువకుడు.. కేసు నమోదు చేసిన పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: పోలింగ్ కేంద్రంలోకి ఓటరు స్లిప్పు, ఓటర్ ఐడీ, ఆధార మాత్రమే తీసుకురావాలని ఈసీ పోలింగ్‌కు ముందు రోజే ఓటర్లు కీలక సూచన చేసింది. అదేవిధంగా సెల్‌ఫోన్లను ఏమాత్రం అనుమతించబోమని తేల్చి చెప్పింది. అయితే, ఆ నిబంధనలను తుంగలో తొక్కుతూ.. భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలం తూర్పుగూడెంకు చెందిన నరేశ్ ఏకంగా పోలింగ్ కేంద్రంలోకి సెల్‌ఫోన్‌ను తీసుకెళ్లాడు. అనంతరం తాను ఓటు వేస్తున్నట్లుగా సెల్పీ తీసుకుని వాట్సప్‌లో షేర్ చేశాడు. అయితే, ఆ ఫొటో సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవ్వడంతో విషయం కాస్త పోలీసుల దృష్టికి వెళ్లింది. ఈ మేరకు నరేశ్‌పై టేకులపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story