Breaking: వైసీపీ అభ్యర్థి వరుపుల సుబ్బారావుకు గాయాలు.. కారు నుజ్జు నుజ్జు

by srinivas |
Breaking: వైసీపీ అభ్యర్థి వరుపుల సుబ్బారావుకు గాయాలు.. కారు నుజ్జు నుజ్జు
X

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా పత్తిపాడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సుబ్బారావుకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో వరుపుల సుబ్బారావుకు స్వల్ప గాయాలయ్యాయి. రెండు కార్లు నుజ్జు నుజ్జు అయ్యాయి. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఈ ప్రమాదం జరిగింది. రోడ్డుపై వరుపుల కారు వెళ్తుండగా ఎదురుగా పశువులు వచ్చినట్లు తెలుస్తోంది. వరుపుల కారు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశారు. అయితే వెనుక వస్తున్న కారు కంట్రోల్ కాలేదు. స్పీడుగా వెళ్లి వరుపుల కారును ఢీకొట్టింది. వరుపుల కారులోని ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో ఆయనకు పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో వరుపులకు స్వల్పగాయాలయ్యాయి. వెంటనే ఆయన మరో కారులో కాకినాడ వెళ్లారు. ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స తీసుకున్నట్లు తెలిసింది.

కాగా పత్తిపాడు వైసీపీ అభ్యర్థిగా వరుపుల సుబ్బారావు పోటీ చేశారు. మే 13న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. దీంతో నియోజకవర్గంలో ఉత్కంఠ నెలకొంది. వరుపుల గెలుపుపై పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ధీమాగా ఉన్నారు.

Next Story

Most Viewed