Nara Brahmini పై ఓ రేంజ్‌లో ఫైర్ అయిన Sri Reddy.. అప్పుడేం పీ** అంటూ..

by Disha Web Desk |
Nara Brahmini పై ఓ రేంజ్‌లో ఫైర్ అయిన Sri Reddy.. అప్పుడేం పీ** అంటూ..
X

దిశ, సినిమా: రీసెంట్‌గా చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో కుటుంబ సభ్యులందరూ పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు అధినేత అరెస్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో నారా బ్రాహ్మణి మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. ‘ఎలాంటి ప్రూఫ్ లేకుండా చంద్రబాబు నాయుడుని కేవలం కక్ష సాధింపు చర్యలో భాగంగా అరెస్ట్ చేశారు. లోకేష్ ఢిల్లీ వెళ్లారు. నేను రాజమండ్రి-విజయవాడ మధ్య తిరుగుతున్నాను. ఎప్పుడు బయటికి రాని మా అత్తమ్మ ఈ రోజు బయటకు వచ్చారు. నా ఎనిమిది సంవత్సరాల బాబు దేవాన్ష్ ఒంటరిగా స్కూల్‌కు వెళ్తున్నాడు. ఇలా మా కుటుంబం మొత్తాన్ని బాధ పెడుతున్నారు’ అని కామెంట్ చేసింది.

అయితే తాజాగా నారా బ్రాహ్మిణి మాటలపై బోల్డ్ బ్యూటీ శ్రీరెడ్డి ఫైర్ అయింది. ‘ఈ రోజు చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో దేవాన్ష్ ఒంటరి అయ్యాడని నువ్వు తెగ బాధపడుతున్నావు. అరెస్ట్ అయినది దేవాన్ష్‌‌కు తాత. తాత అవసరం తనకు లేకపోవచ్చు కానీ ఒకానొక సమయంలో జగనన్న అరెస్ట్ అయ్యారు. ఆయన ఇద్దరు ఆడపిల్లల తండ్రి. మరి వారి పరిస్థితి ఏంటి. ఎప్పుడైనా ఆలోచించావా? ఎప్పుడు బయటకు రాని మా అత్త బయటకు వచ్చింది అని చెబుతున్నావు.. మీడియా అంటే కూడా ఏంటో తెలియని విజయమ్మ ఆరోజు కొడుకు కోసం రోడ్డుపైకి రాలేదా? భర్తను జైల్‌లో పెట్టడంతో భార్యగా భారతి.. ఇద్దరు ఆడపిల్లలతో నడిరోడ్డుపై కూర్చుంటే పోలీసులు లాక్కెళ్లలేదా? అప్పుడు ఎందుకు మాట్లాడలేదు.. అప్పుడేం పీ** ’ అంటూ సూటిగా ప్రశ్నించింది శ్రీరెడ్డి.

ఇవి కూడా చదవండి : Breaking: చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై తీర్పు మళ్లీ వాయిదా

Next Story

Most Viewed