‘‘ఇచ్చిపడేసే గోత్రం.. ఇరగదీసే నక్షత్రం’’.. ట్రోలర్స్‌కు శ్రీలీల స్ట్రాంగ్ కౌంటర్!

by Mallepaka Hamsa |   (  Updated:2026-03-17 08:08:32  IST  )

ఇచ్చిపడేసే గోత్రం.. ఇరగదీసే నక్షత్రం.. అనే మాస్ డైలాగ్‌‌తో తనపై విమర్శలు చేస్తున్న వారికి ఆమె ఈ విధంగా కౌంటర్ ఇచ్చిందని అభిమానులు సంబరపడుతున్నారు.

‘‘ఇచ్చిపడేసే గోత్రం.. ఇరగదీసే నక్షత్రం’’.. ట్రోలర్స్‌కు శ్రీలీల స్ట్రాంగ్ కౌంటర్!
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో చోటుచేసుకున్న ఒక చిన్న సంఘటన సోషల్ మీడియాలో పెను తుఫానునే సృష్టించింది. స్టేజ్ పైన శ్రీలీల తన వెనుక ఉన్న నటుడు మహేష్ వైపు సీరియస్‌గా చూసిన వీడియో క్లిప్ వైరల్ అవ్వడంతో, ఆమెకు గర్వం పెరిగిపోయిందంటూ నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు. అయితే, ఈ వివాదంపై నటుడు మహేష్ స్వయంగా స్పందిస్తూ.. అంతకుముందు తన ఫోన్ పట్టుకోమని నాకు ఇచ్చింది. అందుకే నా వైపు చూసింది అనుకున్నా కానీ ఆలోపే తను స్క్రీన్‌పై చూసిందని శ్రీలీల తనను అగౌరవపరచలేదని క్లారిటీ ఇచ్చారు. ఈ వివాదం చుట్టూ నెగిటివిటీ పెరుగుతున్న సమయంలో, శ్రీలీల తనదైన శైలిలో స్పందించినట్లు ఓ వీడియో వైరల్ అవుతోంది.

ఇక ఈ వీడియోలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంలోని "ఇచ్చిపడేసే గోత్రం.. ఇరగదీసే నక్షత్రం" అనే మాస్ డైలాగ్‌ ఉండటంతో, తనపై విమర్శలు చేస్తున్న వారికి ఆమె ఈ విధంగా కౌంటర్ ఇచ్చిందని అభిమానులు సంబరపడుతున్నారు. ఈ పవర్ ఫుల్ డైలాగ్ వీడియో ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతూ ట్రోలర్ల నోళ్లు మూయిస్తోందని అభిమానులు సంతోషపడుతున్నారు. కాగా.. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ చిత్రం ఉగాది కానుకగా మార్చి 19న విడుదల కాబోతుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. శ్రీలీల పట్ల జరుగుతున్న ఈ వివాదం సినిమా ప్రమోషన్లకు ఒక విధంగా హైప్ తీసుకొచ్చిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. వివాదాలను పక్కన పెట్టి, థియేటర్స్‌లో పవర్ స్టార్ మాస్ మేనరిజమ్స్, శ్రీలీల ఎనర్జిటిక్ డ్యాన్స్‌ను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

త్రిష క్యారెక్టర్ గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టిన స్టార్ నటి ఖుష్భూ!

Next Story