- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొన్ని పజిల్స్ వెంటాడుతాయి.. ‘మృత్యుంజయ్’ టీజర్ అప్డేట్ ఇచ్చిన శ్రీవిష్ణు
టాలీవుడ్ వెర్సటైల్ హీరో శ్రీవిష్ణు (Sree Vishnu)తనదైన శైలిలో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద వరుస విజయాలతో దూసుకుపోతున్నారు.

దిశ, సినిమా: టాలీవుడ్ వెర్సటైల్ హీరో శ్రీవిష్ణు (Sree Vishnu)తనదైన శైలిలో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘మృత్యుంజయ్’(Mrityunjay). హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ‘సామజవరగమన’ ఫేమ్ రేబా మోనికా జాన్ (Reba Monica John)మరోసారి శ్రీవిష్ణు సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రం ఫిబ్రవరి 27న గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది.
ఈ సమయంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ వేగాన్ని పెంచింది. తాజాగా.. ఈ సినిమా టీజర్ విడుదలకు సంబంధించి మేకర్స్ ఒక క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. నేడు (ఫిబ్రవరి 11) సాయంత్రం 5 గంటలకు ‘మృత్యుంజయ్’ టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించి సినిమాపై క్యూరియాసిటీని పెంచారు. ఈ అప్‌డేట్‌తో పాటు శ్రీవిష్ణు షేర్ చేసిన క్యాప్షన్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ‘‘అన్ని పజిల్స్ పరిష్కరించబడటానికి ఉద్దేశించబడలేదు.. కొన్ని వెంటాడటానికి ఉద్దేశించబడ్డాయి’’ అంటూ ఆయన పెట్టిన పోస్ట్, సినిమాలో ఉండబోయే సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌కు అద్దం పడుతోంది. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లో శ్రీవిష్ణు పాత్ర గత సినిమాల కంటే భిన్నంగా ఉండబోతుందని టీజర్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ చూస్తుంటే అర్థమవుతోంది.






