- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సుహాస్ నాకు ఇండస్ట్రీలో మోస్ట్ సపోర్టీవ్ పర్సన్: శివాని నాగరం
టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్(Suhas) కథానయకుడిగా నటిస్తున్న తాజా సినిమా ‘హే భగవాన్’(Hey Bhagavan).

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్(Suhas) కథానయకుడిగా నటిస్తున్న తాజా సినిమా ‘హే భగవాన్’(Hey Bhagavan). గోపి అచ్చర(Gopi Achara) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శివాని నాగారం(Shivani Nagaram) హీరోయిన్‌గా నటిస్తోంది. త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్ పై బి.నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్న ఆ సినిమాకు వివేక సాగర్ సంగీతాన్ని సమకూర్చారు. ఇక వెన్నెల కిశోర్, సుదర్శన్, అన్నపూర్ణమ్మ, యాంకర్ స్రవంతి వంటి ప్రముఖులు కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా ఫిబ్రవరి 20న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మూవీ టీమ్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమాపై ఆసక్తి పెంచుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరోయిన్ శివాని అక్కడ హీరో సుహాస్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘నాకు సుహాత్‌తో ఇది రెండో సినిమా. వెరీ స్పెషల్ ఈ మూవీ నాకు.. ఎందుకంటే అంబాజిపేటలో సుహాస్ నాకు అన్ని విషయాల్లో చాలా సపోర్టీవ్‌గా ఉన్నాడు. నాకు ఇండస్ట్రీలో చాలా సపోర్టీవ్ పర్సన్ అంటే సుహాసే. అతను నాకు చాలా హెల్ప్ చేశాడు. ఇప్పుడు ఈ సినిమా నాకు చాలా చాలా స్పెషల్‌గా.. అండ్ అతనితో మరో సారి స్క్రీన్ షేర్ చేసుకోవడం వెరీ వెరీ హ్యాపీగా ఉంది’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.






