- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సోషల్ మీడియాను బ్యాన్ చేసి వారి భవిష్యత్తును కాపాడాలి.. సోనూసూద్ ఆసక్తికర ట్వీట్
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల జీవనశైలిలో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

దిశ, సినిమా: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల జీవనశైలిలో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. చిన్న వయసులోనే ఫోన్ పట్టుకుని గంటల తరబడి స్క్రోలింగ్ చేస్తూ కంటెంట్ చూసే అలవాటు పెంచుకుంటున్నారు. ఇది వారిలో ఏకాగ్రత తగ్గిపోవడానికి, చదువుపై దృష్టి సరిగా నిలకడగా లేకపోవడానికి కారణమవుతోంది. ఇకపోతే, సోషల్ మీడియాలో అందరి జీవితాలు అన్నీ పర్ఫెక్ట్‌గా కనిపించడం వల్ల పిల్లలు తమను వాళ్లతో పోల్చుకుంటూ మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. లైక్స్, షేర్స్, కామెంట్స్ కోసం ఆతృతగా ఎదురుచూస్తూ చిన్న చిన్న వయసులోనే ఆత్మవిశ్వాసం దెబ్బతినే పరిస్థితి వస్తోంది. అదే సమయంలో, డిజిటల్ ప్రపంచంలో ఉన్న ప్రమాదాల గురించి అవగాహన లేకపోవడంతో స్కామ్‌లు, నకిలీ అకౌంట్స్, ఆన్‌లైన్ బుల్లీయింగ్ వంటి సమస్యల్లో చిక్కుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.
పెద్దల పర్యవేక్షణ లేకుండా పిల్లలు ఏం చూస్తున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో తల్లిదండ్రులు గుర్తించలేని పరిస్థితి. ఇవి మాత్రమే కాదు.. ఇంట్లో కుటుంబ సభ్యులతో గడిపే సమయం తగ్గిపోగా, భావోద్వేగ సంబంధాలు కూడా క్రమంగా బలహీనపడుతున్నాయి. నిజమైన ఆటలు, బయట తిరుగుడు, స్నేహితులతో గడిపే ఆ అనుభూతులు అన్ని డిజిటల్ స్క్రీన్‌ల మధ్యే కరిగిపోయాయి. తాజాగా, ఈ విషయంపై సోనూసూద్ (Sonu Sood)ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. పిల్లలు నిజమైన బాల్యాన్ని ఆస్వాదించేలా, కుటుంబ బంధాలు, బలపడేలా, సోషల్ మీడియా వ్యసనం దూరమయ్యేలా చర్యలు తీసుకోవడం అత్యంత కీలకమని అన్నారు.
మానసిక ఆరోగ్యం, చదువు, సామాజిక వ్యవహారం, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాల్లో డిజిటల్ మీడియా తీవ్రమైన ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే భారతదేశంలో 16 ఏళ్లలోపు వారికి ఆన్‌లైన్ మీడియాపై నిషేదం అవసరం ఉందని అన్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన దేశాలు ఈ నిషేదాన్ని అమలు చేస్తున్నాయని ఇండియాలో కూడా ఈ దిశగా మార్పు చేయాలని చెప్పారు. పిల్లల భవిష్యత్తు కోసం రేపటి మెరుగైనా భారతదేశం కోసం మన పిల్లలను రహించాలని పేర్కొన్నారు. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు సోనుసూద్‌కి సపోర్ట్‌గా నిలుస్తున్నారు. ఆయన చెప్పిన మాటలకు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Read More... ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు షాక్.. రేపు సరెండర్ కావాలని సుప్రీంకోర్టు ఆదేశం
మీకంటే అసదుద్దీన్ ఓవైసీ బెటర్.. తెలంగాణ బీజేపీ ఎంపీలపై మోడీ సీరియస్






