మీకంటే అసదుద్దీన్ ఓవైసీ బెటర్.. తెలంగాణ బీజేపీ ఎంపీలపై మోడీ సీరియస్

by Ajay Maddhiboyina |   (  Updated:2025-12-11 09:21:10  IST  )

తెలంగాణ బీజేపీ ఎంపీల‌పై ప్రధాని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ ఎన్డీఏ ఎంపీల‌తో మోడీ అల్పాహార విందులో పాల్గొన్నారు.

మీకంటే అసదుద్దీన్ ఓవైసీ బెటర్.. తెలంగాణ బీజేపీ ఎంపీలపై మోడీ సీరియస్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ బీజేపీ ఎంపీల‌పై ప్రధాని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ ఎన్డీఏ ఎంపీల‌తో మోడీ అల్పాహార విందులో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌.. తెలంగాణ‌లో బీజేపీ ఎంపీలు సరైన ప్రతిపక్షపాత్ర పోశించడం లేదని అసంతృప్తి వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో పార్టీ ఎందుకు వెనుకబడిందని ప్రశ్నించారు. ప్రజల్లో మంచి ఆదరణ ఉన్నా తెలంగాణలో వెనకబడటంపై అసంతృప్తి వ్యక్తం వ్యక్తం చేశారు. ఇకనైనా విబేధాలు వీడి ఉమ్మడిగా పనిచేయాలని హితవుపలికారు. రాష్ట్రంలో పార్టీ గ్రాఫ్ పెరిగేలా కృషి చేయాలని సూచించారు. అంతేకాకుండా అస‌దుద్దీన్ సోష‌ల్ మీడియా టీమ్ యాక్టివ్ గా ప‌నిచేస్తోంద‌ని ఉదాహ‌రించారు.

ఎంపీల తీరు మారాల‌ని, సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాల‌ని హిత‌బోధ చేశారు. ఏపీలో చంద్ర‌బాబు పాల‌న బాగుంద‌ని ప్ర‌శంస‌లు కురిపించారు. అందుకే ఏపీకి పెట్టుబ‌డులు ఎక్కువ‌గా వ‌స్తున్నాయ‌ని చెప్పారు. ఇదిలా ఉంటే తెలంగాణలో మొత్తం ఎనిమిదిమంది బీజేపీ ఎంపీలు ఉన్న సంగ‌తి తెలిసిందే. అంటే రాష్ట్రంలో అధికార కాంగ్రెస్‌తో స‌మానంగా బీజేపీ ఎంపీలు ఉన్నారు. కానీ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో బీజేపీ ఎంపీలు విఫలం అవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. పార్టీ బలోపేతం విషయంలోనూ పెద్దగా దృష్టి పెట్ట‌డంలేద‌నే విమ‌ర్శ‌లు సైతం వ‌స్తున్నాయి. ఇక ప్ర‌ధాని క్లాస్ తో ఎంపీల ప‌నితీరులో మార్పు వ‌స్తుందా లేదా అనేది చూడాలి.






Next Story