ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు షాక్.. రేపు సరెండర్ కావాలని సుప్రీంకోర్టు ఆదేశం

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-11 09:28:45  IST  )

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు ఊహించని షాక్ తగిలింది.

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు షాక్.. రేపు సరెండర్ కావాలని సుప్రీంకోర్టు ఆదేశం
X

దిశ, వెబ్‌‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు (Prabhakar Rao)కు ఊహించని షాక్ తగిలింది. రేపు జూబ్లీహిల్స్‌లో పోలీస్ స్టేషన్‌లో సిట్ అధికారుల ఎదుట బేషరుతగా లొంగిపోవాలని కావాలని ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా ఆయనను ఫిజికల్ టార్చర్ చేయకూడాదని దర్యాప్తు బృందానికి సూచించింది.

అయితే, కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు దర్యాప్తుకు ఏమాత్రం సహకరించడం లేదని సిట్ అధికారులు ఆరోపిస్తున్నారు. కేసుతో ముడిపడి ఉన్న ఐఫోన్‌కు సంబంధించి క్లౌడ్ ఖాతాల పాస్‌వర్డ్‌లను అన్నింటినీ రీసెట్ చేసి, సమాచారం ఇవ్వట్లేదని ఆయనపై అభియోగాలు మోపారు. దీంతో కేసులో అంతకు ముందు ఆయనకు ఇచ్చిన మధ్యంతర అరెస్ట్ నుంచి ఉపశమనాన్ని ఎత్తివేయాలని కోరుతూ.. సిట్ అధికారులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఇవాళ ఆయన పిటిషన్‌పై జస్టిస్ బీవీ నాగరత్న (Justice BV Nagaratna), జస్టిస్ ఆర్ మహదేవన్ (Justice R Mahadevan) ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరు పక్షాల వాదనలు కోర్టు నిందితుడు ప్రభాకర్ రావును రేపు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో బేషరతుగా లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.

Read More...

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు షాక్.. రేపు సరెండర్ కావాలని సుప్రీంకోర్టు ఆదేశం

మీకంటే అసదుద్దీన్ ఓవైసీ బెటర్.. తెలంగాణ బీజేపీ ఎంపీలపై మోడీ సీరియస్

Next Story