‘బింబిసార’ డైరెక్టర్‌పై రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫైర్..

by Disha Web Desk 9 |
‘బింబిసార’ డైరెక్టర్‌పై రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫైర్..
X

దిశ, సినిమా: కళ్యాణ్ రామ్ నటించిన ‘బింబిసార’ చిత్రంతో డెబ్యూ డైరెక్టర్ వశిష్ట బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. కానీ సినిమా విడుదలై ఏడాది కావస్తున్నా ఇప్పటి వరకు మళ్లీ ఎలాంటి ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. అయితే తన తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి. ఇదంతా బాగున్నప్పటికీ.. ప్రజెంట్ మెగా అభిమానులు వశిష్టపై మండిపడుతున్నారు. కారణం రామ్ చరణ్‌ను ట్రోల్ చేసిన ట్వీట్‌ను, ఈ డైరెక్టర్ లైక్ చేసినట్లు ఫ్యాన్స్ గుర్తించడమే. దీంతో చేసేదేమీలేక దర్శకుడు అతడి ప్రొఫైల్‌ను లాక్ చేశాడు. అయినా వెనక్కి తగ్గని అభిమానులు.. చిరంజీవిని ట్యాగ్ చేసి వశిష్టతో సినిమా చేయొద్దని కోరారు.

ఇవి కూడా చదవండి: ‘పుట్టింటి పరువు తీస్తున్న నిహారిక..’ సోషల్ మీడియాలో ట్రోల్స్

Next Story

Most Viewed