‘పుట్టింటి పరువు తీస్తున్న నిహారిక..’ సోషల్ మీడియాలో ట్రోల్స్

by Nagaya |
‘పుట్టింటి పరువు తీస్తున్న నిహారిక..’ సోషల్ మీడియాలో ట్రోల్స్
X

దిశ, సినిమా: ఈ మధ్య మెగా డాటర్ నిహారిక తన వ్యక్తిగత విషయాలతో వార్తల్లో నిలుస్తోంది. ఏం జరిగిందో తెలియదు కానీ నిహారికకు గత కొన్ని రోజులుగా తన భర్తతో విభేదాలు వస్తున్నాయని, విడాకులు తీసుకునే యోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. తర్వాత చిరంజీవి వీరిద్దరిని కలిపారని కూడా టాక్ వచ్చింది. కానీ నిహారిక దీనిపై ఇప్పటి వరకు స్పందించలేదు. పైగా మొన్నటి వరకు సైలెంట్‌గా ఉన్న ఈ బ్యూటీఫుల్ గర్ల్.. ఈ మధ్య సోషల్ మీడియాలో ఫోటోషూట్స్‌తో అటెన్షన్ క్యాచ్ చేస్తోంది. ఈ మధ్య చీరలో సొగసు చూడతరమా అనిపించిన భామ.. తాజాగా ‘డెనిమ్ ఇష్యూ’ అంటూ కాస్త హాట్ ఫొటోస్ పెట్టింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఇది కాస్ట్యూమ్ ఇష్యూ కాదు, నిజంగానే సమస్య అనుకుంటా’, ‘మీరు ఎవరి కూతురో తెలుసా.. పుట్టింటి పరువు తీస్తున్నారు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి: ‘బింబిసార’ డైరెక్టర్‌పై రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫైర్..


న్యూయార్క్ సిటీలో నటీ ఎంజాయ్.. వైరల్ అవుతున్న పిక్స్

Next Story

Most Viewed