- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
61 ఏళ్ల స్టార్ హీరో సరసన శ్రద్ధా కపూర్.. బయోపిక్ కోసం భారీ రిస్క్ చేస్తున్న యంగ్ బ్యూటీ?
ఈ సినిమాలో ఆమిర్ ఖాన్ భార్య పాత్ర కోసం శ్రద్ధా కపూర్‌ను సంప్రదించారట ఇందుకు ఆమె కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ కెరీర్‌లో పీక్ స్టేజ్‌లో ఉంది. రీసెంట్‌గా వచ్చిన ‘స్త్రీ-2’ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడంతో, ఈమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం ఆమె చేతిలో నాగిన్, ఈత, స్త్రీ-3 వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న ఈ భామ తాజాగా, ఓ బయోపిక్‌లో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమిర్ ఖాన్ సరసన ఆమె ఒక కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రముఖ వ్యాపారవేత్త, ‘షార్క్ ట్యాంక్ ఇండియా’ ఫేమ్ అష్నీర్ గ్రోవర్ జీవిత చరిత్ర ఆధారంగా ఒక సినిమా రాబోతోందని, అందులో ఆమిర్ ఖాన్ హీరోగా నటిస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో ఆమిర్ ఖాన్ భార్య పాత్ర కోసం శ్రద్ధా కపూర్‌ను సంప్రదించారట ఇందుకు ఆమె కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. రాహుల్ మోడీ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంపై బాలీవుడ్ వర్గాల్లో ఇప్పటికే ఆసక్తి నెలకొంది. అష్నీర్ గ్రోవర్ 2022లో తన కంపెనీ నిధుల దుర్వినియోగం ఆరోపణలతో వార్తల్లో నిలిచారు. అటువంటి వివాదాస్పద, ఆసక్తికరమైన వ్యక్తి బయోపిక్‌లో ఆమిర్ ఖాన్ నటించడం విశేషం.
అయితే, ఈ కాంబినేషన్ వార్త బయటకు రాగానే నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా వయసు వ్యత్యాసంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆమిర్ ఖాన్ వయసు 61 ఏళ్లు కాగా, శ్రద్ధా కపూర్ చాలా చిన్నది. ఇంత ఏజ్ గ్యాప్ ఉన్న హీరో సరసన శ్రద్ధా నటించాల్సిన అవసరం ఏముందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. "నీ రేంజ్ ఏంటి.. నువ్వు చేసే సినిమాలేంటి? 61 ఏళ్ల హీరోతో భార్య పాత్ర చేయడం ఏంటి?" అంటూ శ్రద్ధాకు నెటిజన్లు సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. ఈ ప్రాజెక్టు గురించి కానీ, శ్రద్ధా కపూర్ ఎంపిక గురించి కానీ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కేవలం ఇవి సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు మాత్రమే అయినప్పటికీ, ఆమిర్ ఖాన్, శ్రద్ధా కపూర్ అభిమానుల మధ్య ఇది హాట్ టాపిక్‌గా మారింది. ఒకవేళ శ్రద్ధా ఈ ఆఫర్‌ను ఓకే చేస్తే, అది ఆమె కెరీర్‌కు ప్లస్ అవుతుందా లేక నెగిటివ్ అవుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.ఈ సినిమాతో భారీ రిస్క్ తీసుకునేందుకు సిద్ధమైన శ్రద్ధాకు లక్ కలిసొస్తుందా? లేదా అనేది చూడాలి.






