- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Shraddha Kapoor: బిగ్ షాకిచ్చిన శ్రద్ధా కపూర్.. నేను పెళ్లి చేసుకుంటానంటూ పోస్ట్
గత కొద్దికాలంగా ఇండియన్ సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల హవా కనిపిస్తోంది.

దిశ, సినిమా: గత కొద్దికాలంగా ఇండియన్ సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల హవా కనిపిస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా చాలామంది సెలబ్రిటీలు బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్‌బై చెబుతూ కొత్త జీవితాన్ని మొదలుపెడుతున్నారు. కెరీర్‌తో పాటు పర్సనల్ లైఫ్‌కూ సమాన ప్రాధాన్యం ఇస్తూ, తమ జీవిత భాగస్వామితో సెటిల్ అవ్వాలని భావిస్తున్నారు. కొందరు స్టార్ సెలబ్రిటీలు ముందుగానే తమ పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించి అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం రిలేషన్‌షిప్‌ను సీక్రెట్‌గా ఉంచి, పెళ్లి తర్వాతే విషయం బయటపెడుతున్నారు.
ఇంకొందరు సెలబ్రిటీలు మాత్రం ప్రేమ, పెళ్లి విషయాల్లో పూర్తి క్లారిటీ ఇవ్వకుండా.. పార్ట్‌నర్‌తో కలిసి ఈవెంట్స్, ఫంక్షన్లకు హాజరవుతూ ఆసక్తిని పెంచుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియాలో అనేక రకాల ఊహాగానాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇదే ట్రెండ్ బాలీవుడ్‌లోనూ కొనసాగుతోంది. తాజాగా, ఓ యంగ్ హీరోయిన్ పెళ్లి చేసుకుంటానని పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్(Shraddha Kapoor) గత కొద్ది కాలంగా రచయిత రాహుల్ మోదీ(Rahul Mody)తో ప్రేమాయణం నడుపుతోంది. నిత్యం వీరిద్దరు పలు వెకేషన్స్‌కు, డిన్నర్‌కు వెళ్తూ వార్తల్లో నిలుస్తున్నారు. అయినప్పటికీ తమ రిలేషన్‌షిప్ గురించి మాత్రం అధికారికంగా స్పందించడం లేదు.
ఎన్ని వార్తలు వచ్చినప్పటికీ సైలెంట్‌గా తమ పని తాము చేసుకుంటున్నారు. ఈక్రమంలోనే.. ఓ జ్యువెలరీ బ్రాండ్ ప్రమోషన్స్‌లో భాగంగా శ్రద్ధా పెళ్లిపై స్పందించింది. అందులో లవ్ బ్రేకప్ గురించి మాట్లాడింది. ఇక ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. దీంతో అది చూసిన ఓ నెటిజన్.. మీ పెళ్లి సంగతేంటి అని అడగ్గా.. దానికి శ్రద్ధా స్పందిస్తూ.. ‘‘నేను కూడా పెళ్లి చేసుకుంటాను’’ అని రిప్లై ఇవ్వడం గమనార్హం. అది చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే అభిమానులు పెళ్లెప్పుడని ఆరా తీస్తుండగా.. కొందరు నెటిజన్లు మాత్రం రాహుల్‌ను చేసుకుంటుందా? లేక వేరే వ్యక్తినా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Read More..
నీకు ఏ పొజీషన్ అంటే ఇష్టం అంటూ నెటిజన్ అసభ్యకర కామెంట్.. స్ట్రాంగ్‌గా ఇచ్చిపడేసిన హీరోయిన్






