- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెగా అభిమానులకు షాక్.. మరోసారి వాయిదా పడనున్న ‘పెద్ది’!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'పెద్ది' సినిమా విడుదల మరోసారి వాయిదా పడబోతున్నట్లు టాక్.

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'పెద్ది' సినిమా విడుదల మరోసారి వాయిదా పడబోతున్నట్లు సోషల్ మీడియాలో పలు పోస్టులు హల్ చల్ చేస్తున్నాయి. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా, ముందుగా అనుకున్న ఏప్రిల్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడం కష్టమేనని సమాచారం. వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పెండింగ్‌లో ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా వాయిదా పడటం తమిళ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న 'కర' చిత్రానికి పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. ఏప్రిల్ 30న విడుదల కానున్న 'కర' మూవీకి ఇప్పుడు తెలుగు, తమిళ మార్కెట్లలో సోలోగా బాక్సాఫీస్ వద్ద సందడి చేసే అవకాశం దక్కింది. వాస్తవానికి 'పెద్ది' చిత్రాన్ని మార్చి 2026లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.
కానీ, షూటింగ్ సమయంలో రామ్ చరణ్‌కు చిన్న గాయం కావడం వల్ల చిత్రీకరణకు కాస్త విరామం ఇవ్వాల్సి వచ్చిందట. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాను మే చివరలో లేదా జూన్ 2026లో విడుదల చేసేందుకు నిర్మాతలు కసరత్తు చేస్తున్నారట. బుచ్చిబాబు సనా, ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు వంటి స్టార్ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమా అవుట్‌పుట్ విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశంతోనే చిత్ర యూనిట్ నిదానంగా పనులు పూర్తి చేస్తోందని టాక్. అధికారిక ప్రకటన ఇంకా రానప్పటికీ, ఇతర సినిమాల నిర్మాతలు, పంపిణీదారులు 'పెద్ది' కొత్త రిలీజ్ డేట్‌ను బట్టి తమ సినిమాల షెడ్యూల్స్‌ను అడ్జస్ట్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కాబట్టి సరైన టైమ్ చూసి మే లేదా జూన్‌లో విడుదల చేయడమే ఉత్తమమని మేకర్స్ భావిస్తున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు షాక్ అవుతున్నారు.






