ఓటీటీలోకి రాబోతున్న శర్వానంద్ ‘బైకర్’.. ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ కానుందంటే?

by Mallepaka Hamsa |   (  Updated:2026-04-21 09:01:20  IST  )

థియేటర్లలో సందడి చేసిన ఈ ‘బైకర్’ ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది.

ఓటీటీలోకి రాబోతున్న శర్వానంద్ ‘బైకర్’.. ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ కానుందంటే?
X

దిశ, సినిమా: టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్ చాలా కాలం తర్వాత వెండితెరపై మెరిసిన చిత్రం ‘బైకర్’. యువ దర్శకుడు అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఇందులో శర్వానంద్ సరసన మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటించగా, సీనియర్ హీరో రాజశేఖర్ ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించడం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చినప్పుడు మంచి ఓపెనింగ్స్ సాధించింది. ముఖ్యంగా యువతను, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను రేసింగ్ సన్నివేశాలు బాగా ఆకట్టుకున్నాయి. జిబ్రాన్ అందించిన సంగీతం కూడా సినిమాకు ప్లస్ అయ్యింది. అయితే, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ. 40 కోట్ల క్లబ్‌లో చేరినప్పటికీ, బయ్యర్లకు పూర్తిస్థాయిలో లాభాలను తెచ్చిపెట్టలేకపోయింది. దీంతో కమర్షియల్ గా శర్వానంద్‌కు ఇది యావరేజ్ ఫలితాన్నే ఇచ్చిందని చెప్పవచ్చు. థియేటర్లలో సందడి చేసిన ఈ ‘బైకర్’ ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని మే 1వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయాలని నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ చేస్తోంది. వేసవి సెలవుల కానుకగా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులోకి రానుందని టాక్. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారు మే మొదటి వారం నుంచి ఇంట్లోనే కూర్చుని ఫ్యామిలీతో ఎంజాయ్ చేయవచ్చు.

‘KING-100’ షూటింగ్‌ అప్డేట్.. నాగార్జునతో రొమాన్స్‌ చేయడంపై పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చిన ఐశ్వర్య రాజేష్

Next Story