‘KING-100’ షూటింగ్‌ అప్డేట్.. నాగార్జునతో రొమాన్స్‌ చేయడంపై పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చిన ఐశ్వర్య రాజేష్

by Mallepaka Hamsa |   (  Updated:2026-04-21 09:02:08  IST  )

మనాలిలోని అందమైన లొకేషన్లలో హిమాచల్ ప్రదేశ్ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్న ఫోటోలను ఆమె పోస్ట్ చేసింది.

‘KING-100’ షూటింగ్‌ అప్డేట్.. నాగార్జునతో రొమాన్స్‌ చేయడంపై పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చిన ఐశ్వర్య రాజేష్
X

దిశ, సినిమా: అక్కినేని నాగార్జున కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ చిత్రం (KING-100) ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా మారింది. కోలీవుడ్ దర్శకుడు రా. కార్తీక్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం మనాలిలోని మంచు కొండల్లో శరవేగంగా జరుగుతోంది. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించని ఒక బిగ్ అప్‌డేట్‌ను హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తన సోషల్ మీడియా పోస్ట్‌తో రివీల్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. చాలా కాలంగా నాగార్జున సరసన ఐశ్వర్య రాజేష్ నటిస్తుందనే వార్తలు వినిపిస్తున్నా, మేకర్స్ మాత్రం దీనిని సీక్రెట్‌గా ఉంచారు. కానీ, తాజాగా ఐశ్వర్య తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఫోటోలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి.

మనాలిలోని అందమైన లొకేషన్లలో హిమాచల్ ప్రదేశ్ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్న ఫోటోలను ఆమె పోస్ట్ చేసింది. అంతేకాకుండా, ఈ చిత్ర దర్శకుడు రా. కార్తీక్‌తో కలిసి దిగిన ఫోటోలను కూడా షేర్ చేయడంతో, ఆమె ‘కింగ్-100’లో హీరోయిన్‌గా ఫిక్స్ అయిపోయిందని క్లారిటీ వచ్చేసింది. సహజ సిద్ధమైన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేష్, ఇప్పుడు కింగ్ నాగార్జునతో రొమాన్స్ చేయబోతుండటం ఆసక్తికరంగా మారింది. మనాలి షెడ్యూల్‌లో వీరిద్దరి మధ్య కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. గ్లామర్‌తో పాటు నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో రాణించే ఐశ్వర్య, నాగ్ వంటి సీనియర్ స్టార్ సరసన ఎలా మెప్పిస్తుందోనని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

ఈ క్రేజీ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయడం ఖాయమని కొందరు అంటుంటే, మరికొందరు మాత్రం ఈ వెర్సటైల్ యాక్ట్రెస్ తీసుకున్న ఈ నిర్ణయం ఆమె కెరీర్‌కు ఎలాంటి మలుపు ఇస్తుందోనని చర్చించుకుంటున్నారు. మరోవైపు, 66 ఏళ్ల వయసులోనూ నాగార్జున అత్యంత స్టైలిష్‌గా కనిపిస్తున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మనాలి పోలీసులతో నాగ్ దిగిన ఫోటోలు చూస్తుంటే, అక్కినేని ఫ్యాన్స్‌కు ఈ 100వ సినిమా ఒక విజువల్ ట్రీట్‌లా ఉండబోతుందని అర్థమవుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నాగ్ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఐశ్వర్య రాజేష్ ఎంట్రీతో ఈ ప్రాజెక్ట్‌కు మరింత కలర్ యాడ్ అయ్యిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఓటీటీలోకి రాబోతున్న శర్వానంద్ ‘బైకర్’.. ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ కానుందంటే?

Next Story