- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘సంక్రాంతికి వస్తున్నాం’కి సీక్వెల్.. ఈసారి అంతకు మించి ఫన్..
ప్రజెంట్ హిట్ డైరెక్టర్స్ లిస్టులో ముందు వరసలో ఉన్నాడు అనిల్ రావిపూడి.

దిశ, వెబ్‌డెస్క్: ప్రజెంట్ హిట్ డైరెక్టర్స్ లిస్టులో ముందు వరసలో ఉన్నాడు అనిల్ రావిపూడి. అతను ఈ సంక్రాంతికి ‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి నయనతార జంటగా నటించిన ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ కీరోల్ ప్లే చేశాడు. అయితే గత ఏడాది వెంకీ మామతో ‘సంక్రాంతికి వస్తున్నాం’తో అనిల్ రావిపూడి బ్లాక్‌బస్టర్‌ను అందుకున్న విషయం తెలిసిందే.
ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ వెంకీ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా రికార్డుకెక్కింది. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి సినిమా ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. వివరాల్లోకి వెళితే.. అనిల్ రావిపూడి తన తదుపరి ప్రాజెక్టును వెంకటేష్‌తో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సీక్వెల్‌కు సిద్ధమవుతున్నారని తెలిసింది.
ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం’ సినిమా చేస్తున్నారు వెంకటేశ్. ఈ సినిమా ఏప్రిల్‌లోగా పూర్తవుతుందని తెలిసింది. దీని తర్వాత వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సీక్వెల్‌లో జాయిన్ అవుతారని ఫిల్మ్‌నగర్ టాక్. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read More..






