‘నువ్వు తోపు కాదు తోపులకు బాపువి’: డైరెక్టర్‌పై నిర్మాత ప్రశంసలు

by Gantepaka Srikanth |   (  Updated:2026-01-18 13:42:50  IST  )

మెగాస్టార్ చిరంజీవి - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా భారీ విజయం సాధించింది.

‘నువ్వు తోపు కాదు తోపులకు బాపువి’: డైరెక్టర్‌పై నిర్మాత ప్రశంసలు
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) - అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్‌లో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా భారీ విజయం సాధించింది. విడుదలైన ఆరు రోజుల్లోనే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఆరు రోజుల్లో కలిపి రూ.261 కోట్ల కలెక్షన్లు సాధించినట్లు పేర్కొన్నారు. తాజాగా ఈ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడిపై నిర్మాత బండ్ల గణేష్ ప్రశంసలతో ముంచెత్తారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా బండ్ల గణేష్(Bandla Ganesh) పోస్టు పెట్టారు.

‘ఈ చిత్రం కేవలం సంక్రాంతి బ్లాక్ బస్టర్ మాత్రమే కాదు. బాక్సాఫీస్ కింగ్ కూడా. అన్నయ్య మెగాస్టార్ స్వాగ్‌ అండ్ స్టైల్‌తో ఇరగదీశారు. తెలుగు ఆడియెన్స్‌ను తండోపతండాలుగా థియేటర్‌కు రప్పించారు. అనిల్ రావిపూడి ఒక మెజీషియన్. తోపు కాదు.. తోపులకే అనిల్ బాపు. ఈ సినిమాలో వెంకటేశ్ గెస్ట్ కూడా అదిరిపోయింది. చిరంజీవి, వెంకటేశ్ కాంబినేషన్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమాను ఎవడూ ఆపలేడు. చిత్రబృందానికి ప్రత్యేక శుభకాంక్షలు’ అని బండ్ల గణేష్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

READ MORE ....

‘సంక్రాంతికి వస్తున్నాం’కి సీక్వెల్‌.. ఈసారి అంతకు మించి ఫన్..

Next Story