- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
2027 సంక్రాంతికి వచ్చే 5 సినిమాలు ఇవే !
అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం 2 సినిమాను కూడా 2027లో తీసుకురాబోతున్నారట.

దిశ, వెబ్ డెస్క్: ఈ సంక్రాంతికి తెలుగు సినిమాలు సందడి చేశాయి. ముఖ్యంగా తెలుగు సంబంధించిన ఐదు సినిమాలు రిలీజ్ అయి దాదాపు సక్సెస్ అందుకున్నాయి. ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ మినహా సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాలన్నీ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. ఇలాంటి నేపథ్యంలో 2027 సంక్రాంతి బరిలో ఉండే సినిమాల లిస్టు ఇప్పుడు వైరల్ గా మారింది. వచ్చే సంక్రాంతికి కూడా మెగాస్టార్ చిరంజీవి మరోసారి రంగంలోకి దిగుతాడని టాక్ నడుస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి 158 సినిమా బాబీ దర్శకత్వంలో రాబోతుంది. కెవిఎన్ ప్రొడక్షన్ లో ఈ సినిమా వస్తుంది. ఈ మూవీ వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుందట. అలాగే కుర్ర హీరో తేజ సజ్జా జాంబిరెడ్డి 2 సినిమా కూడా వచ్చే సంక్రాంతికి రిలీజ్ కాబోతుందని టాక్. మరోసారి శర్వానంద్ కూడా తన 39వ సినిమాతో 2027 సంక్రాంతి బరిలో ఉండబోతున్నాడట.
శ్రీను వైట్ల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కిస్తున్నారట. కామెడీ, యాక్షన్ నేపథ్యంలో వస్తుందని తెలుస్తోంది. రజినీకాంత్ తన కొత్త సినిమాతో వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానున్నారట. ఇక సంక్రాంతి వీరుడు అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం 2 సినిమాను కూడా 2027లో తీసుకురాబోతున్నారట. 2025లోనే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో హిట్ అందుకున్నారు. నెక్ట్స్ ఈ సినిమా సీక్వెల్ తో వస్తున్నారు. మరి ఈ సినిమాలలో ఏది హిట్ అవుతుందో చూడాలి.






