వాళ్ల ఇద్దరిని అలా చూసి గుండె బద్దలైంది.. నటి కామెంట్స్ వైరల్

by Disha Web Desk 7 |
వాళ్ల ఇద్దరిని అలా చూసి గుండె బద్దలైంది.. నటి కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవికి తాజాగా పద్మభూషణ్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో నెట్టింట ప్రశంసలు కురిపిస్తున్నారు. కొంతమంది సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, ఫ్యాన్స్ డైరెక్ట్‌గా కలిసి ఆయనను అభినందిస్తున్నారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా చిరుని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అయితే.. ‘గుంటూరు కారం’ సినిమా తర్వాత త్రివిక్రమ్ బయట ఎక్కువగా కనిపించలేదు. ఇప్పుడు చిరుతో ఫొటోలు దిగడంతో.. ప్రస్తుతం అవి నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.

ఇదిలా ఉంటే.. పూనమ్ కౌర్‌కి త్రివిక్రమ్ అంటే పడదు అని అందరికీ తెలిసిన విషయమే. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ బ్యూటీ.. త్రివిక్రమ్‌పై ఎప్పుడూ కౌంటర్లు వేస్తుంటుంది. అయితే.. అసలు ఆయన ఏం చేశాడు అనేది మాత్రం ఇప్పటికే సస్పెన్స్ గానే ఉంటుంది. ఈ క్రమంలోనే చిరంజీవి, త్రివిక్రమ్ కలిసి ఉన్న ఫొటోలు వైరల్ కావడంతో వాటిపై స్పందించింది. ‘ఇది చాలా హర్టింగ్ విషయం’ అంటూ బ్రోకెన్ హార్ట్ సింబల్‌ను షేర్ చేసింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షార్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Read More : వారిని కాకాపట్టడం వల్లే చిరంజీవికి పద్మవిభూషన్ అవార్డ్.. హీరోయిన్ పూనమ్ కౌర్‌ సంచలన పోస్ట్!

Next Story

Most Viewed