- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
వారిని కాకాపట్టడం వల్లే చిరంజీవికి పద్మవిభూషన్ అవార్డ్.. హీరోయిన్ సంచలన పోస్ట్!
దిశ, సినిమా: అత్యంత ప్రతిష్టాత్మక అవార్డ్ పద్మ విభూషన్ ఇటీవల చిరంజీవికి వచ్చిన విషయం తెలిసిందే. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో సినీ, రాజకీయ ప్రముఖులు చిరుకి శుభాకాంక్షలతో పాటు ఆయనను ప్రశంసించారు. తాజాగా, హీరోయిన్ పూనమ్ మాత్రం చిరంజీవిని విమర్శిస్తూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ షేర్ చేసింది. ‘‘ బాలీవుడ్ హీరో సోనూసూద్ కూడా ఆ ప్రెస్టీజియస్ అవార్డ్‌కు అర్హులు. కరోనా సమయంలో ఆయన చేసిన సేవ అసామాన్యం. అయితే ఆయనకు ఏ రాజకీయ నాయకుడిని కాకాపట్టడం తెలియదు కదా’’ అంటూ రాసుకొచ్చింది.
ఇండైరెక్ట్‌గా చిరంజీవి కొందరినీ కాకాపట్టడం వల్లే అవార్డ్ వచ్చింది అన్నట్లుగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పూనమ్ పోస్ట్ వైరల్ అవుతుండగా అది చూసిన కొందరు ఆమెపై ఫైర్ అవుతున్నారు. మరికొందరు మాత్రం ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. ఇదిలా ఉంటే.. పూనమ్ గత కొద్ది కాలంగా సినిమాలకు దూరమైంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్‌గా ఉంటూ పలు వివాదాస్పద పోస్టులతో నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఆమె చేసే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. దీంతో ఆమెపై కొందరు ట్రోల్స్ కూడా చేస్తారు. అయినప్పటికీ అవన్నీ పూనమ్ పట్టించుకోకుండా తనకు చెప్పాలనిపించింది ధైర్యంగా చెబుతుంది.
Read More : వాళ్ల ఇద్దరిని అలా చూసి గుండె బద్దలైంది.. నటి పూనమ్ కౌర్ కామెంట్స్ వైరల్