మీ మాట నేనెందుకు వినాలి.. నేను నాలాగే ఉంటాను: నెటిజన్ల సలహాలపై Sara Ali Khan

by Dishanational2 |
మీ మాట నేనెందుకు వినాలి.. నేను నాలాగే ఉంటాను: నెటిజన్ల సలహాలపై Sara Ali Khan
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటి సారా అలీఖాన్ సోషల్ మీడియాలో ఎదుర్కొన్న విమర్శల గురించి ఓపెన్ అయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి తన కెరీర్ అండ్ పర్సనల్ స్ట్రగుల్ గురించి మాట్లాడుతూ.. ‘మంచో చెడో నాకు తెలియదు. కానీ చాలామంది నాలో చాలా మార్పులు రావాలని చెప్పారు. కానీ నన్ను నేను మార్చుకోలేదు. నాలాగే ఉండాలనుకున్నా. అలాగే ఉంటాను. ఎందుకంటే నేను పనిచేసిన ప్రతి సినిమాలోని పాత్ర కోసం చాలా కష్టపడ్డాను. అలాగే నెట్టింట నెగెటీవ్, పాజిటీవ్ కామెంట్స్ చూసి జీవితంలో కొన్ని మనకు ఉపయోగపడని విషయాలు కూడా ఉంటాయని నేను గమనించాను. అయినప్పటికీ బ్యాడ్ కామెంట్స్ చూసి పెద్దగా ఆందోళన చెందను. ప్రజలకు నా పని నచ్చకపోతేనే వాళ్లు చెప్పేది వింటా. ఎందుకంటే పనికి సంబంధించిన విషయాల్లో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఎవరికైనా ముఖ్యమే. ఇక పర్సనల్ లైఫ్‌ గురించి వచ్చిన పుకార్లను పెద్దగా పట్టించుకోను. నా దృష్టి అంతా రాబోయే ప్రాజెక్టులు, పనిమీదనే ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చింది.

Also Read: బోల్డ్ డ్రెస్సింగ్‌లో రెచ్చిపోయిన Manchu Lakshmi.. రొమాంటిక్ యాంగిల్‌‌కు కుర్రాళ్లు ఫిదా



Next Story

Most Viewed