ప్రభాస్‌ను అంత మాట అనేసిన సప్తగిరి.. సోషల్ మీడియాలో దుమారం రేపుతున్న కామెంట్స్!

by Mallepaka Hamsa |   (  Updated:2025-12-28 06:47:33  IST  )

సెలబ్రిటీలు స్టేజి ఎక్కితే చాటు ఆవేశంలో నోటికొచ్చిందల్లా మాట్లాడుతూ చిక్కుల్లో పడుతున్నారు.

ప్రభాస్‌ను అంత మాట అనేసిన సప్తగిరి.. సోషల్ మీడియాలో దుమారం రేపుతున్న కామెంట్స్!
X

దిశ, సినిమా: సెలబ్రిటీలు స్టేజి ఎక్కితే చాటు ఆవేశంలో నోటికొచ్చిందల్లా మాట్లాడుతూ చిక్కుల్లో పడుతున్నారు. ఇటీవల ఈ మధ్య ఇలాంటి సంఘటనలు బాగానే జరుగుతున్న విషయం తెలిసిందే. నిత్యం ఇండస్ట్రీలో ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉంది. తీరా వివాదానికి దారితీయడంతో పాటు కేసులు కూడా నమోదు అవుతుండటంతో ఏమీ చేయలేని పరిస్థితుల్లో కొంతమంది క్షమాపణలు చెప్తున్నారు. రీసెంట్‌గా శివాజీ ‘దండోరా’ స్టేజ్‌పై హీరోయిన్ల సామాన్లపై చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరో నటుడు స్టేజ్‌పై ఓ స్టార్ హీరోను కమెడియన్ అని ఇబ్బందుల్లో పడ్డాడు. తాజాగా, ‘ది రాజాసాబ్’ (The Raja Saab)ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న కమెడియన్ సప్తగిరి (Sapthagiri)ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘మంచి మనసున్న మారాజు మారుతి. మకుటం లేని మహారాజు ప్రభాస్(Prabhas) అన్నతో కలిసి తీసిన ‘ది రాజాసాబ్’ ఈ సంక్రాంతికి గులాబ్ జామ్‌లు గలగలాడించకపోతే.. కోడిగుడ్లు కూడా డబుల్ ఆమ్లెట్లు అవుతాయి జాగ్రత్త.

రాసిపెట్టుకోండి.. ‘రాజాసాబ్’రూ. 2000 కోట్లు కొల్లగొట్టకపోతే నేను ఇస్తా.. ఆ డబ్బులు మనమందరం కలిసి ఇద్దాం. దీనిని హారర్ ఫాంటసీ స్టోరీతో తీశారు. ఇందులో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. పూర్తి స్థాయి కమర్షియల్ సినిమాగా రాబోతుంది. మీరు ఇప్పటివరకు చాలా మంది కమెడియన్స్ ని చూసి ఉంటారు. కానీ, ప్రభాస్ అందరికన్నా పెద్ద కమెడియన్’’ అని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన ప్రభాస్ అభిమానులు.. ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్ హీరో కామెడీ చేస్తే.. కమెడియన్ అయిపోతాడా. కొంచెం చూసుకుని మాట్లాడాలి. కదా నోరు అదుపులో పెట్టుకో’’ అని కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి సప్తగిరి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో ఆయనపై ట్రోలింగ్ జరుగుతోంది.

Read More..

ఈ సినిమా విజయం వారికి చెంపదెబ్బలాంటిది.. అనుపమ్ ఖేర్ సెన్సేషనల్ పోస్ట్

Next Story