ఈ సినిమా విజయం వారికి చెంపదెబ్బలాంటిది.. అనుపమ్ ఖేర్ సెన్సేషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2025-12-28 06:30:22  IST  )

బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్(Ranveer Singh), అక్షయ్ ఖన్నా, మాధవన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘ధురంధర్’(Dhurandhar).

ఈ సినిమా విజయం వారికి చెంపదెబ్బలాంటిది.. అనుపమ్ ఖేర్ సెన్సేషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్(Ranveer Singh), అక్షయ్ ఖన్నా, మాధవన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘ధురంధర్’(Dhurandhar). ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్స్‌లోకి వచ్చి బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టిస్తోంది. పలు రికార్డులు బ్రేక్ చేస్తూ.. ప్రశంసలు అందుకుంటోంది. 21 రోజుల్లోనే రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరి 2025లో నెంబర్ 1 సినిమాగా నిలిచింది. అంతేకాకుండా ఈ చిత్రం మొదటి షో నుంచి బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతుంది. దీంతో ఈ మూవీపై నెటిజన్లతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాకుండా ‘ధురంధర్’పై విమర్శలు చేస్తున్న వారికి స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ (Anupam Kher)ట్రోలర్స్‌కు గట్టిగా ఇచ్చిపడేశాడు. ఈ సినిమాను కేవలం ఓ దుష్ప్రచారం కోసం తీశారని అన్నవారికి.. ‘ధురంధర్’ సక్సెస్ చెంపదెబ్బలాంటిది. నేను ఈ చిత్రంలో ఎలాంటి రోల్ చేయలేదు కానీ దీని సక్సె చూస్తుంటే మనసుకి ప్రశాంతంగా, గర్వంగా అనిపిస్తుందని అన్నారు.

గతంలో తన సినిమాలు ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్, ది కశ్మీర్ ఫైల్స్ వచ్చినప్పుడు కూడా కొంతమంది ఆడియన్స్ ప్రాపగాండా అని ముద్రవేసి వాటిని దెబ్బకొటాలని చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. అంందులో కొంతవరకు సక్సెస్ అయ్యారు.. కానీ ‘ధురంధర్’ విషయంలో ట్రోలర్స్ ఆట సాగలేదు. సినిమాను ఆదరించిని ఆడియన్స్ విమర్శకులకు గట్టి సమాధానం చెప్పారని అన్నారు. అంతేకాకుండా మాకు ఏం చూడాలో తెలుసని.. తమకు నీతులు చెప్పొద్దని విమర్శకులకు చెంపదెబ్బ లాంటి తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియోను షేర్ చేశారు. ఇక అది చూసిన ‘ధురంధర్’ డైరెక్టర్ ఆదిత్య ధర్ స్పందిస్తూ..‘‘మీ మాటలు విని ఎమోషనల్ అయ్యాను. గొప్ప సినిమాలతో నా చిత్రాన్ని పోల్చడం నాకు దక్కిన గొప్ప గౌరవం. నిజాయితీగా సినిమాలు తీయడానికి మీ మాటలు బలాన్ని ఇస్తాయి’’ అని రిప్లై ఇచ్చారు.

Read More..

ఆ స్టార్ హీరో సినిమాపై అక్కినేని కోడలు పొగడ్తల వర్షం.. సెల్యూట్ చేస్తున్న ఎమోజీలతో పోస్ట్

Next Story