ఆ స్టార్ హీరో సినిమాపై అక్కినేని కోడలు పొగడ్తల వర్షం.. సెల్యూట్ చేస్తున్న ఎమోజీలతో పోస్ట్

by Gugulothu.Kavitha |   (  Updated:2026-02-12 11:57:04  IST  )

అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ కూడా దురంధర్ మూవీ చూసి తన ఇన్‌స్టా వేదికగా ఈ సినిమాను ప్రశంసిస్తూ స్టోరీ పెట్టింది. అందులో.. ‘వావ్.. వావ్.. వావ్.. ఉత్కంఠభరితం. మనసును కదిలించేది. స్ఫూర్తిదాయకం. మరే ఇతర వాటికి భిన్నంగా. అత్యున్నతమైనది.. సారా అర్జున్ ఎంత ప్రతిభ, ఎంత అందం’ అని రాసుకొస్తూ సెల్యూట్ చేస్తున్న ఎమోజీలతో పాటు నమస్కారం చేస్తున్న, హార్ట్ సింబల్స్ ఎమోజీలను జోడించింది.

ఆ స్టార్ హీరో సినిమాపై అక్కినేని కోడలు పొగడ్తల వర్షం.. సెల్యూట్ చేస్తున్న ఎమోజీలతో పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh)ప్రధాన పాత్రలో నటించిన ‘ధురంధర్’(Dhurandhar) మూవీ థియేటర్లలో రిలీజ్ అయి బాక్సాఫీసును షేక్ చేస్తోంది. ఇప్పటికీ భారీ వసూళ్లు సాధిస్తోన్న ఈ చిత్రం ఇప్పటివరకు వరల్డ్‌ వైడ్‌గా రూ.1000 కోట్ల మార్క్‌ను దాటేసింది. అంతేకాకుండా ‘ధురంధర్’ 2025లో భారత్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ రికార్డు ఇంతకుముందు ‘యానిమల్‌’కు ఉండగా.. దాన్ని బ్రేక్ చేసి ‘ధురంధర్’ ఏ రేటింగ్ సినిమాగా ఘనత సాధించింది. ఇక ఈ సినిమాపై ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు స్పందించి ఇంట్రెస్టింగ్ పోస్టులు పెడుతున్నారు.

ఈ క్రమంలో తాజాగా అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ కూడా దురంధర్ మూవీ చూసి తన ఇన్‌స్టా వేదికగా ఈ సినిమాను ప్రశంసిస్తూ స్టోరీ పెట్టింది. అందులో.. ‘వావ్.. వావ్.. వావ్.. ఉత్కంఠభరితం. మనసును కదిలించేది. స్ఫూర్తిదాయకం. మరే ఇతర వాటికి భిన్నంగా. అత్యున్నతమైనది.. సారా అర్జున్ ఎంత ప్రతిభ, ఎంత అందం’ అని రాసుకొస్తూ సెల్యూట్ చేస్తున్న ఎమోజీలతో పాటు నమస్కారం చేస్తున్న, హార్ట్ సింబల్స్ ఎమోజీలను జోడించింది. దీంతో ఈ స్టోరీ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు వివిధ రకరకాలుగా స్పందిస్తున్నారు.

Read More..

ఆ టైంలో నేను అతన్ని కలిశాను.. చాలా హ్యాపీగా అనిపించింది.. ఆ స్టార్ హీరోపై జూనియర్ సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్




Next Story