- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ టైంలో నేను అతన్ని కలిశాను.. చాలా హ్యాపీగా అనిపించింది.. ఆ స్టార్ హీరోపై జూనియర్ సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్
జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న నటి అషు రెడ్డి(Ashu Reddy) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న నటి అషు రెడ్డి(Ashu Reddy) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. కొన్ని సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్‌లో అలరించిన ఈ చిన్నది ప్రజెంట్ పలు టీవీ షోలతో పాటు సోషల్ మీడియాలో ఫుల్ బిజీ బిజీగా ఉంటుంది. అయితే డైరెక్టర్ ఆర్జీవీ(RGV)తో చేసిన ఒకే ఒక్క ఇంటర్వ్యూతో ఈ భామ నైటుకు నైటే ఫేమస్ అయిపోయింది. దీంతో బిగ్ బాస్ సీజన్-3లో కంటెస్టెంట్‌గా చాన్స్ వచ్చింది.
అక్కడ ఆ హౌస్‌లో అడుగు పెట్టిన ఈ చిన్నది అక్కడ కూడా నానా హంగామా చేసి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. ఇక బయటికి వచ్చాక ఈ ముద్దుగుమ్మ టీవీ షోలు, సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంది. అయితే సోషల్ మీడియాలో ఈ అమ్మడి గ్లామర్ డోసు ఎక్కువగానే ఉంటుంది. నెట్టింట హాట్ షో చేస్తూ పిచ్చెక్కిస్తుంటది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అషురెడ్డి పవన్ కళ్యాణ్‌తో తన ప్రత్యేక అనుభవాన్ని పంచుకుంది.
ఆమె మాట్లాడుతూ.. ‘హరి హర వీరమల్లు షూటింగ్ సమయంలో సారథి స్టూడియోలో ఆయనను కలిసే అవకాశం లభించింది. 2018లో నేను చూపించిన ఒక టాటూను గుర్తుపెట్టుకుని పవన్ కళ్యాణ్ నన్ను గుర్తించడం ఆశ్చర్యానికి గురిచేసింది. దాదాపు రెండున్నర గంటల పాటు ఆయన నాతో చాలా క్యాజువల్‌గా, ఒక ఫ్రెండ్‌లా, మెంటర్‌లా మాట్లాడారు’ అని అషు రెడ్డి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.






