ఆగలేకపోతున్నా అంటూ.. ఆ స్టార్‌ హీరోలపై సమంత స్పెషల్ పోస్ట్..!

by Disha Web Desk 6 |
ఆగలేకపోతున్నా అంటూ.. ఆ స్టార్‌ హీరోలపై సమంత స్పెషల్ పోస్ట్..!
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకున్న దగ్గర నుండి ఒంటరిగా ఉంటున్న విషయం తెలిసిందే. ఇటీవల మయోసైటీస్ వ్యాధినుండి కూడా కోలుకుని సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంది. అక్కినేని నాగార్జున, నాగచైతన్యలకు దూరంగా ఉంటున్న సమంత కొద్ది రోజుల అఖిల్ 'ఏజెంట్' సినిమా అప్డేట్ల మీద స్పందించింది. అంతేకాకుండా సమంత అక్కినేని హీరోలు దగ్గుబాటి వారితో సంబంధాలు కొనసాగిస్తునట్టు తెలుస్తోంది.

తాజాగా, దగ్గుబాటి హీరోలు వెంకటేష్, రానా కలిసి నటించిన 'రానా నాయుడు' వెబ్‌ సిరీస్‌పై సామ్ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ''రానా నాయుడు ట్రైలర్‌లో వెంకటేష్, రానాను 'చిన్నప్పుడు నీ ముడ్డి కడిగాను రా' అనే డైలాగ్ సమంతకు బాగా నచ్చిందట. ఎప్పుడెప్పుడు ఈ వెబ్ సిరీస్ చూస్తానా? అని ఆగలేకపోతున్నాను' అంటూ సమంత తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది. కాగా, సమంత చేస్తున్న వర్కౌట్లు, తీర్చుకుంటున్న మొక్కుటు చూస్తుంటే మునుపటి కంటే రెట్టింపు వేగంతో దూసుకుపోయేలా కనిపిస్తుంది.


Read more:

Amy Jackson: బాయ్ ఫ్రెండ్‌ను పరిచయం చేసిన అమీ జాక్సన్!

Next Story