- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ సినిమాలో సమంత గెస్ట్ రోల్..? క్యూరియాసిటీ పెంచేస్తున్న న్యూస్
యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పరదా’(Parada). లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీకి ప్రవీణ్ కండ్రేగుల(Praveen Kandregula) దర్శకత్వం వహిస్తున్నాడు.

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పరదా’(Parada). లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీకి ప్రవీణ్ కండ్రేగుల(Praveen Kandregula) దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో సీనియర్ యాక్టర్ సంగీత(Sangeetha), మలయాళీ హీరోయిన్ దర్శన రాజేంద్రన్(Darshana Rajendran) ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని ఆనంద మీడియా బ్యానర్ పై విజయ్ డొంకాడ శ్రీనివాసులు పివి, శ్రీధర్(Sridhar) నిర్మిస్తున్నారు.
ఇక ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ గ్లింప్స్, టీజర్, ట్రైలర్ అన్ని ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. ఈ క్రమంలో ఓ న్యూస్ సోషల్ మీడియాను కుదిపేస్తుంది. వివరాల్లోకి వెళితే.. పరదా సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత(Samantha) క్యామియో రోల్‌లో కనిపించనున్నారని తెలుస్తోంది. క్లైమాక్స్‌లో సామ్ రోల్ సర్ ప్రైజింగ్‌గా ఉంటుందనే టాక్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అయితే సినిమా ముగింపులో కీలకమైన టైంలో ఆ పాత్ర ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది. కాగా దీనిపై మూవీ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది.
కాగా ‘ఏమాయ చేసావే’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సమంత.. ఈ మూవీలో హీరోగా నటించిన అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya)తో ప్రేమలో పడింది. అలా కొన్నేళ్లు ప్రేమించుకున్న వీరు పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ, మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకొని దూరంగా ఉంటున్నారు. విడాకుల తర్వాత నాగచైతన్య రీసెంట్‌గా స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ(Shobhitha Dhulipala)తో డిసెంబర్‌లో రెండో పెళ్లి చేసుకున్నాడు .
సమంత మాత్రం విడాకుల తర్వాత మయోసైటీస్(Myositis) అనే వ్యాధి బారిన పడడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. హెల్త్ పై ఫోకస్ పెట్టింది. కాగా రీసెంట్‌గా ‘సిటాడెల్: హనీ బన్నీ’(Citadel: Honey Bunny) అనే వెబ్ సిరీస్‌తో మన ముందుకు వచ్చి మంచి మార్కులే కొట్టేసింది. అలాగే సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన ఫొటోస్, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది.
Read More..
viral: కన్యత్వాన్ని ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టిన 22 ఏళ్ల యువతి.. వేలంలో ఎగబడిన శ్రీమంతులు






