వాళ్లతో నన్ను పోల్చొద్దు.. క్లారిటీ ఇచ్చిన సమంత

by Disha Web Desk 7 |
వాళ్లతో నన్ను పోల్చొద్దు.. క్లారిటీ ఇచ్చిన సమంత
X

దిశ, సినిమా : బ్యూటిఫుల్ సమంత ప్రస్తుతం ‘సిటాడెల్’ షూటింగ్‌లో బిజీగా ఉంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సిరీస్‌లో వరుణ్ ధావన్ హీరో కాగా సామ్ మరో అమేజింగ్ క్యారెక్టర్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ‘ఇండియన్ వెర్షన్‌‌గా వస్తున్న ఈ సిరీస్.. ప్రియాంక చోప్రా ‘సిటాడెల్’ రీమేక్‌గా వస్తోందా?’ అని అడిగాడు ఓ అభిమాని. ఎందుకంటే గ్లోబల్ సిరీస్‌గా రిలీజ్ అయిన ప్రియాంక ‘సిటాడెల్’ తెలుగులోనూ డబ్ అయిందని, అలాంటప్పుడు ఈ సిరీస్ చేసి వేస్ట్ కదా అని ప్రశ్నించాడు. దీనిపై రియాక్ట్ అయిన సామ్.. కచ్చితంగా కాదని తెలిపింది. దీంతో ఖుష్ అవుతున్న ఫ్యాన్స్ ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. ‘శాకుంతలం’ డిజాస్టర్ తర్వాత రాబోతున్న ఈ సిరీస్‌కు పాజిటివ్ టాక్ వస్తుందనే నమ్మకంతో ఉన్నామని అంటున్నారు.

Also Read.. నాగచైతన్యపై ప్రేమను బయట పెట్టిన కృతి శెట్టి.. అలా చెబుతూ..

నాగచైతన్య ‘దూత‘ రిలీజ్ అప్ డేట్..



Next Story

Most Viewed