Samantha: వైరల్ వీడియోపై స్పందించిన సామ్.. వారి తప్పు లేదంటూ సంచలన కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2025-12-25 09:26:58  IST  )

ఇటీవల కాలంలో సెలబ్రిటీలపై అభిమానాన్ని వ్యక్తం చేసే తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది.

Samantha: వైరల్ వీడియోపై స్పందించిన సామ్.. వారి తప్పు లేదంటూ సంచలన కామెంట్స్
X

దిశ, సినిమా: ఇటీవల కాలంలో సెలబ్రిటీలపై అభిమానాన్ని వ్యక్తం చేసే తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. అభిమానం పేరుతో కొంతమంది హీరోయిన్లతో హద్దులు దాటి ప్రవర్తించడం వంటివి చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల నిధి అగర్వాల్ అభిమానులు ‘ది రాజాసాబ్’ ఈవెంట్‌లో కొందరు ఆమెను టచ్ చేయడానికి ప్రయత్నించడం గమనార్హం. చాలా ఇబ్బంది పడుతూ నిధి అక్కడినుంచి ఎలాగోలా తప్పించుకుని వెళ్లిపోయింది. ఈ ఘటన మరవక ముందే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు అలాంటి చేదు అనుభవమే ఎదురైంది. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని చెక్‌పోస్ట్ ప్రాంతంలో ఉన్న సిరిమల్లె శారీస్ కొత్త షోరూమ్ ప్రారంభోత్సవానికి సామ్ హాజరయ్యారు. ఈ ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు, మీడియా ప్రతినిధులతో పాటు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సమంతను చూడాలనే ఉత్సాహంతో జనం ముందే పెద్ద ఎత్తున గుమిగూడారు. ఇక ఈ కార్యక్రమం అనంతరం సమంత బయటకు వస్తుండగా.. ఒక్కసారి పరిస్థితి అదుపుతప్పి అభిమానులు హద్దులు మీరారు.

సెల్ఫీల కోసం ఆమెపై ఎగబడడంతో తోపులాట వాతావరణం నెలకొంది. దీంతో అప్రమత్తమైన సమంత టీమ్ సమంతను జనాల మధ్య నుంచి తప్పించి కారులో కూర్చోబెట్టి పంపించారు. ఇంత గందరగోళం జరుగుతున్నప్పటికీ సామ్ మాత్రం సహనం కోల్పోకుండా చిరునవ్వుతోనే అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఈక్రమంలో.. తాజాగా,ఈ సంఘటన గురించి సమంత(Samantha) స్పందించి షాకింగ్ కామెంట్స్ చేసింది. అభిమానులు దగ్గరగా వస్తే పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. హాయ్ చెప్పడానికి, ఫోటోలు తీసుకోవడానికి ఇష్టపడే వాళ్లు సహజంగానే ఉంటారు. వారిలో చాలామందికి ఎలాంటి చెడు ఉద్దేశాలు ఉండవు, కేవలం అభిమానంతో, ఆనందంతో దగ్గరికి వస్తారు అంతే. అలాంటి సందర్భాల్లో మనం భయపడాల్సిన అవసరం లేదు.

అభిమానులు చూపించే ప్రేమను గౌరవించాలని అన్నారు. కార్యక్రమాలు, వేడుకలు, పబ్లిక్ ఈవెంట్ల వంటి చోట్ల పెద్ద సంఖ్యలో, అదుపు చేయలేని జనసమూహాలు ఏర్పడితే మాత్రం పరిస్థితి భిన్నంగా మారుతుంది. తోపులాట, తొక్కిసలాట, అనూహ్యమైన గందరగోళం వల్ల ఎవరికైనా హాని జరిగే పరిస్థితులు తలెత్తవచ్చు. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో అప్రమత్తంగా, బాధ్యతతో ఉంటే సరిపోతుంది. భద్రతా సిబ్బంది, నిర్వాహకులు ముందస్తు ఏర్పాట్లు చేయడం, జనాన్ని నియంత్రించే విధానాలు అమలు చేయడం చాలా అవసరం. అలాగే పాల్గొనే వారు కూడా పరిమితులు పాటిస్తూ సహకరిస్తే ఇలాంటి సంఘటనలు తలెత్తవని చెప్పింది. జనాల మధ్యకు వెళ్లినప్పడు జాగ్రత్తలు పాటించడం ముఖ్యమే.. అలాగే అభిమానుల ప్రేమను ఆనందంగా స్వీకరించాలని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక ఈ విషయం తెలుసుకున్న జనాలు సామ్ బంగారంరా అని కామెంట్స్ చేస్తున్నారు.

Related News : ‘నన్ను తక్కువగా అంచనా వేయొద్దు’.. అనసూయ స్ట్రాంగ్ వార్నింగ్ (పోస్ట్)

నాకు సుప్రియ ఫోన్ చేసి అలా అన్నది.. నేను వెంటనే సారీ అని చెప్పాను: శివాజీ

Next Story