నాకు సుప్రియ ఫోన్ చేసి అలా అన్నది.. నేను వెంటనే సారీ అని చెప్పాను: శివాజీ

by I. Sairam |   (  Updated:2025-12-25 05:49:44  IST  )

గత రెండు రోజుల నుంచి శివాజీ(Shivaji) పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది.

నాకు సుప్రియ ఫోన్ చేసి అలా అన్నది.. నేను వెంటనే  సారీ అని చెప్పాను: శివాజీ
X

దిశ, వెబ్‌డెస్క్: గత రెండు రోజుల నుంచి శివాజీ(Shivaji) పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. ‘దండోరా’ ఈవెంట్‌లో శివాజీ మాట్లాడుతూ.. అందం చీరకట్టులో, ఒళ్లు కనిపించకుండా వేసుకునే బట్టల్లోనే ఉంటుంది. అలా కాకుండా అభ్యంతరకరంగా (సామాన్లు కనిపించేలా) బట్టలు వేసుకుంటే అందులో విలువేముంటుంది? అంటూ చేసిన కామెంట్స్‌ తీవ్ర దుమారం లేపిన విషయం తెలిసిందే. ఈ కామెంట్స్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవడంతో ఇప్పటికే శివాజీ క్షమాపణలు కూడా తెలియజేశాడు.

తాజాగా తన స్పీచ్‌పై మరోసారి పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు శివాజీ. తాజాగా ఈ విషయంపై శివాజీ ఓ ప్రెస్ మీట్‌లో స్పందిస్తూ.. ‘నాకు సుప్రియ(Supriya) గారు మాత్రమే ఫోన్ చేశారు. ఇంకెవ్వరూ చేయలేదు. ఆమె ఫోన్‌లో “అయ్యో శివాజీ గారు, ఏంటి ఇది?” అనగానే, నేను వెంటనే “సారీ అమ్మ, పొరపాటున రెండు పదాలు దొర్లాయి. ఇది నాకు కంప్లీట్‌గా రీగ్రెటింగ్‌గా ఉంది అమ్మా.. ఐ యామ్ వెరీ సారీ ” అని చెప్పాను అని అన్నాడు.

అలాగే నాకు ఇప్పటికీ ఆ రెండు పదాలు నేను ఎలా మాట్లాడానో అర్థం కావడం లేదు. నేను బయట బూతులు మాట్లాడనా అంటే మాట్లాడుతా అండి.. బయట మనమందరం మాట్లాడుతామండి.. అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుకుంటాం.. కానీ ఓ వేదిక ఓ పద్ధతి జనరేషన్‌కి మనమే చెప్పాలి కాబట్టి, మన పిల్లలకు చెప్పాలి కాబట్టి అలా మాట్లాడటం తప్పే అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Read More..

ఎలాంటి బట్టలైనా వేసుకోండి ఎక్కడైనా చావండి నాకేంటి.. అనసూయకు కౌంటర్ ఇచ్చిన శివాజీ


Next Story