‘నన్ను తక్కువగా అంచనా వేయొద్దు’.. అనసూయ స్ట్రాంగ్ వార్నింగ్ (పోస్ట్)

by Mallepaka Hamsa |   (  Updated:2025-12-25 05:48:28  IST  )

టాలీవుడ్ స్టార్ యాంకర్, నటి, అనసూయ(Anasuya) నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులతో సంచలనం సృష్టిస్తోంది.

‘నన్ను తక్కువగా అంచనా వేయొద్దు’.. అనసూయ స్ట్రాంగ్ వార్నింగ్ (పోస్ట్)
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ యాంకర్, నటి, అనసూయ(Anasuya) నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులతో సంచలనం సృష్టిస్తోంది. మరీ ముఖ్యంగా.. శివాజీ హీరోయిన్ల బట్టలపై చేసిన కామెంట్లకు అనసూయ గట్టిగానే ఇచ్చిపడేసింది. రెండు రోజులుగా వరుస పోస్టులతో నెటిజన్లు చేత విమర్శలు, ప్రశంసలు అందుకుంటోంది. కొందరు ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తుంటే.. మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. శివాజీ (Shivaji)చెప్పింది అక్షరాలా నిజమని అంటున్నారు. ఇద్దరు పిల్లల తల్లివి అయుండి.. బాడీ పార్ట్స్ కనిపించే బట్టలు కాకుండా సంప్రదాయంగా కనిపించాలంటూ సలహాలు ఇస్తున్నారు. అంతేకాకుండా అనసూయను దారుణంగా తిడుతూ పోస్టులు పెడుతున్నారు. అయినప్పటికీ ఈ అమ్మడు ఏ మాత్రం వెనకడుగు వేయకుండా.. శివాజీకి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. ఈక్రమంలో.. తనపై భారీ వ్యతిరేకత ఏర్పడింది. అలాగే నెగెటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు.

నన్ను తక్కువగా అంచనా వేయొద్దు

తాజాగా, అనసూయ ట్విట్టర్ ద్వారా ఓ పోస్ట్ పెట్టింది. ‘‘అందరికీ నేను ఈ విషయం చెప్పదల్చుకున్నాను.. కొంతమంది పురుషులు.. ఇంకా కొంతమంది మహిళలు కూడా.. నా వయసును ఉపయోగించి నన్ను తక్కువగా చూపించడానికి.. నన్ను చిన్నగా భావింపజేయడానికి ప్రయత్నిస్తున్నారు. నన్ను తక్కువగా అంచనా వేయొద్దు. ఈ విధమైన ఆలోచన కలిగిన వారు ఎక్కువగా ప్రగతిశీల మహిళలను లక్ష్యంగా చేసుకుంటారు.. ఇది మహిళలపై నియంత్రణ కోల్పోతామన్న భయం వల్ల.. అలాగే బలహీనమైన పితృస్వామ్య అహంకారాన్ని పోషించుకోవాలనే ఉద్దేశంతో జరుగుతుంది.. ఇది అందరి పురుషుల గురించీ లేదా అందరి మహిళల గురించీ కాదు.. కానీ నేను పురుషులు.. మహిళలు.. అందరికీ విన్నపం చేస్తున్నాను.. దయచేసి విస్తృతంగా ఆలోచించండి.

నెటిజన్లకు వార్నింగ్

పాత తరాలు నేర్చుకున్నవి లేదా అలవాటుపడ్డ ఆలోచనలు మనం తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మనం మార్పును ఎంచుకోవచ్చు.. మన గౌరవాన్ని.. మన స్వేచ్ఛను కాపాడుకోవచ్చు.. ఒకరికొకరం శక్తినివ్వాలి.. మద్దతుగా నిలవాలి.. మన విలువ మన ఎంపికల నుంచే వస్తుంది.. మరే దానితో కాదు. కొంతమంది మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.. మీ పని బాధ్యతతో చేయాలి.. ఈ విధమైన మహిమాపరచడం (గ్లోరిఫికేషన్) సమంజసం కాదు / అభినందనీయం కాదు. మీరు మీ అసూయను కొనసాగించండి.. మేము మా ప్రభావాన్ని కొనసాగిస్తాము’’ అని నెటిజన్లకు వార్నింగ్ ఇచ్చింది.

Read More..

నాకు సుప్రియ ఫోన్ చేసి అలా అన్నది.. నేను వెంటనే సారీ అని చెప్పాను: శివాజీ


Next Story