- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్‌తో సినిమా చేయడంపై షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన సల్మాన్.. సంచలనంగా మారిన పోస్ట్
గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పుకార్లకు సల్మాన్ పోస్ట్‌తో ఎట్టకేలకు తెరపడింది.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఓ తెలుగు ప్రాజెక్ట్‌కు సైన్ చేసినట్లు గత కొద్ది కాలంగా పలు పోస్టులు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా దిల్ రాజు బ్యానర్‌పై svc ప్రొడక్షన్‌లో రాబోతున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇక ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నట్లు టాక్. ఈక్రమంలో.. తాజాగా, ఈ విషయంపై స్పందించిన సల్మాన్ ఖాన్ ఓ షాకింగ్ ప్రకటన చేశాడు. గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పుకార్లకు సల్మాన్ పోస్ట్‌తో ఎట్టకేలకు తెరపడింది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన తదుపరి చిత్రాన్ని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో, నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
SVC63 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ ఏప్రిల్ నుండి ప్రారంభం కాబోతోంది. "గుండె, మెదడు, ధైర్యంతో ఈ ప్రయాణం మొదలవుతోంది" అంటూ సల్మాన్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట సంచలనం సృష్టిస్తోంది.ఈ క్రేజీ ప్రాజెక్టులో సల్మాన్ ఖాన్‌ను మునుపెన్నడూ చూడని సరికొత్త మాస్ అవతార్‌లో చూపించబోతున్నారట. ముంబైలోని గోరేగావ్ ప్రాంతంలో ఈ సినిమా కోసం ఇప్పటికే ఒక భారీ 'మిని సిటీ' సెట్‌ను సిద్ధం చేశారని తెలుస్తోంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో, పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. మరోవైపు, సల్మాన్ ఖాన్ ప్రస్తుతం తన ప్రతిష్టాత్మక చిత్రం ‘మాతృభూమి’ విడుదల పనుల్లో బిజీగా ఉన్నారు.
అపూర్వ లఖియా దర్శకత్వంలో రాబోతున్న ఈ వార్ డ్రామాలో సల్మాన్, గాల్వాన్ లోయ ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా 2026 ఆగస్టు 15న విడుదలయ్యే అవకాశం ఉండగా, వంశీ పైడిపల్లి సినిమాను 2027 ఈద్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇన్నాళ్లూ కేవలం రూమర్ అనుకున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు పట్టాలెక్కుతుండటంతో అటు హిందీ, ఇటు తెలుగు ప్రేక్షకులు ఫుల్ ఖుషీలో ఉన్నారు.మరికొందరు షాక్ అవుతున్నారు. ఇదెక్కటి ట్విస్ట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.






