టాలీవుడ్ స్టార్స్‌పై రాషా తడాని హాట్ కామెంట్స్.. తెలుగు ఇండస్ట్రీకి రావడంపై స్టార్ కిడ్ రియాక్షన్ ఇదే!

by Mallepaka Hamsa |   (  Updated:2026-03-30 07:07:56  IST  )

నాకు చిన్నప్పటి నుండి సౌత్ సినిమాలు అంటే చాలా ఇష్టం. ప్రభాస్ సర్, జూనియర్ ఎన్టీఆర్ సర్, మహేష్ బాబు సర్ చిత్రాల్లో ఉండే ఎలిమెంట్స్ నన్ను బాగా ఆకట్టుకుంటాయి.

టాలీవుడ్ స్టార్స్‌పై రాషా తడాని హాట్ కామెంట్స్.. తెలుగు ఇండస్ట్రీకి రావడంపై స్టార్ కిడ్ రియాక్షన్ ఇదే!
X

దిశ, సినిమా: బాలీవుడ్ సీనియర్ స్టార్ రవీనా టాండన్ గారాల పట్టి రాషా తడాని, ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఒక్క సినిమా కూడా విడుదల కాకముందే సౌత్ చిత్రసీమలో హాట్ టాపిక్‌గా మారింది. గతేడాది ఆమన్ దేవగన్ సరసన 'ఆజాద్' చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఈ 21 ఏళ్ల బ్యూటీ, ఇప్పుడు టాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమైంది. 'RX 100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'శ్రీనివాస మంగాపురం' సినిమాతో రాషా తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది. ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతుండటం విశేషం.ఇటీవల రాషా పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన 'బిహైండ్ ద సీన్స్' (BTS) వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇందులో రాషా లుక్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాషా సౌత్ ఎంట్రీపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. "నాకు చిన్నప్పటి నుండి సౌత్ సినిమాలు అంటే చాలా ఇష్టం. ప్రభాస్ సర్, జూనియర్ ఎన్టీఆర్ సర్, మహేష్ బాబు సర్ చిత్రాల్లో ఉండే ఎలిమెంట్స్ నన్ను బాగా ఆకట్టుకుంటాయి. వారిమూవీస్ ఎంతో అద్భుతంగా ఉంటాయి. అలాంటి గొప్ప ఇండస్ట్రీలో భాగం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అంతా బాగా జరగాలని నేను ఆశిస్తున్నాను" అని చెప్పుకొచ్చింది. అలాగే రష్మిక మందన్న, శ్రీలీల వంటి నటీమణులు తనకు ఎంతో స్ఫూర్తినిస్తారని ఆమె పేర్కొంది. తెలుగు సినిమాతో పాటు బాలీవుడ్‌లోనూ రాషా బిజీగా ఉంది. ఆమె నటించిన రెండో చిత్రం 'లైకీ లైకా' విడుదలకు సిద్ధమవుతోంది.

ఇందులో అభయ్ వర్మ హీరోగా నటిస్తుండగా, 'యానిమల్' వంటి బ్లాక్ బస్టర్ చిత్రానికి డైలాగ్స్ అందించిన సౌరభ్ గుప్తా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రం తన కెరీర్‌లో అత్యంత కీలకం కాబోతోందని, ప్రేక్షకులను ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుందని రాషా ధీమా వ్యక్తం చేస్తోంది. ‘‘ఈ సినిమా నాకు చాలా ముఖ్యమైనది కాబోతోంది. ఇప్పటికే అయింది కూడా. 'యానిమల్' సినిమాకు దర్శకుడు సౌరభ్ గుప్తా డైలాగ్స్ రాశారు, ఇంకా అభయ్ పాత్ర చాలా ప్రత్యేకమైనది. నాపై ప్రజలకు ఉన్న అంచనాలను ఈ సినిమా అందుకుంటుందని నేను ఆశిస్తున్నాను’’ అని చెప్పింది. అటు మహేష్ బాబు ఫ్యామిలీ నుండి వస్తున్న హీరోతో, ఇటు క్రేజీ డైరెక్టర్ అజయ్ భూపతితో సినిమా చేస్తుండటంతో రాషాకు టాలీవుడ్‌లో గ్రాండ్ వెల్‌కమ్ లభించడం ఖాయమనిపిస్తోంది.

తెలుగులో కలిసిరాని అదృష్టం.. కోలీవుడ్‌లో బంపర్ ఆఫర్ అందుకున్న కేతిక శర్మ..


Next Story