- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మొట్టమొదటి సారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో సాయి పల్లవి!
ఇప్పటివరకు హోమ్లీ, ఎమోషనల్ పాత్రల్లో మెప్పించిన సాయి పల్లవి, తొలిసారి ఖాకీ దుస్తులు ధరించి యాక్షన్ సీన్స్‌లో కనిపించనుండటంతో అభిమానుల్లో ఒక్కసారిగా హైప్ క్రియేట్ అయింది.

దిశ, సినిమా: టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకుల అభిమాన హీరోయిన్ సాయి పల్లవి ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ జోష్‌లో ఉన్నారు. గత ఏడాది ‘తండేల్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సాయి పల్లవి ఇప్పుడు క్రేజీ ప్రాజెక్ట్స్’ను లైన్‌లో పెడుతున్నారు. బాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘రామాయణ’లో సీత పాత్రలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. అంతేకాకుండా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కెరీర్‌లో ‘D-55’గా రాబోతున్న చిత్రంలోనూ కీలక పాత్రలో నటించనుంది. ఈ మూవీకి ‘అమరన్’ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. సాయి పల్లవికి ఈ దర్శకుడితో ఇది రెండో సినిమా కావడం విశేషం. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవితో పాటు టాలెంటెడ్ బ్యూటీ శ్రీలీ, వర్సటైల్ యాక్టర్ ఎస్ జే కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్స్‌ను ధనుష్‌కు చెందిన వండర్ బార్ ఫిల్మ్స్, ఆర్ టేక్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు గ్రాండ్‌గా పూర్తి కాగా, షూటింగ్ కూడా శరవేగంగా ప్రారంభమైంది. ఈక్రమంలో.. తాజాగా, ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త తెగ వైరల్ అవుతోంది. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో సాయి పల్లవి మొట్టమొదటి సారి ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు హోమ్లీ, ఎమోషనల్ పాత్రల్లో మెప్పించిన సాయి పల్లవి, తొలిసారి ఖాకీ దుస్తులు ధరించి యాక్షన్ సీన్స్‌లో కనిపించనుండటంతో అభిమానుల్లో ఒక్కసారిగా హైప్ క్రియేట్ అయింది. కాగా..ధనుష్-సాయి పల్లవి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన 'మారి-2' లోని 'రౌడీ బేబీ' సాంగ్ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. మళ్లీ వీరిద్దరి కాంబోలో, అది కూడా రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో సినిమా వస్తుండటంతో పాటు పోలీస్‌గా సాయి పల్లవి నటిస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.






