ప్రదీప్ రంగనాథన్ సినిమాలో నాకు ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కింది.. స్వాసిక ఆసక్తికర కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2026-06-05 09:28:50  IST  )

ప్రదీప్ రంగనాథన్ సార్ నిర్మాణంలో ఒక కొత్త సినిమా ప్రారంభమైంది. ఈ చిత్రంలో నేను కూడా ఒక భాగమయ్యాను.

ప్రదీప్ రంగనాథన్ సినిమాలో నాకు ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కింది.. స్వాసిక ఆసక్తికర కామెంట్స్
X

దిశ, సినిమా: కోలీవుడ్ యంగ్ బ్యూటీ స్వాసిక హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. తెలుగు, తమిళ చిత్రాలతో బాక్సాఫీసు వద్ద హిట్స్ అందుకుంటోంది. ఇటీవల ‘కరుప్పు’లో కీలక పాత్రలో కనిపించిన స్వాతిక తన ఖాతాలో హిట్ వేసుకుంది. విజయ్ ఆంటోనీతో కలిసి నటించిన 'నూరు సామి' సినిమా జూన్ 19న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రం విడుదల కాకముందే మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో నటించే అవకాశం దక్కించుకుంది. తాజాగా, ఈ విషయాన్ని స్వాసిక వెల్లడిస్తూ ఆసక్తికర విషయాలు పంచుకుంది. ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు నిర్మాతగా తన రెండో అడుగు వేస్తున్న విషయం తెలిసిందే. గత కొద్దిరోజులుగా ప్రదీప్ రంగనాథన్ నిర్మాణంలో మమిత బైజు ప్రధాన పాత్రలో ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా రాబోతోందని వార్తలు వస్తున్నాయి.

ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ.. ఈ ప్రాజెక్ట్‌లో తాను కూడా ఒక మంచి పాత్ర పోషిస్తున్నట్లు ఆమె వెల్లడించింది. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైందని, తానూ సెట్స్‌లో జాయిన్ అయ్యానని స్వాసిక స్పష్టం చేసింది. "ప్రదీప్ రంగనాథన్ సార్ నిర్మాణంలో ఒక కొత్త సినిమా ప్రారంభమైంది. ఈ చిత్రంలో నేను కూడా ఒక భాగమయ్యాను. మమిత బైజు, అశ్వత్ మరిముత్తులతో కలిసి నటిస్తున్నాను. ఈ క్రేజీ కాంబినేషన్‌లో నాకు ఒక మంచి ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కింది. ఈ సినిమాతో అశ్వత్ మరిముత్తు హీరోగా పరిచయం అవుతున్నారు. ప్రేక్షకుల ఫేవరెట్ మమిత బైజు లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది, నేను కూడా షూటింగ్‌లో జాయిన్ అయ్యాను" అని స్వాసిక సంతోషం వ్యక్తం చేసింది. ఈ చిత్రానికి ప్రదీప్ రంగనాథన్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఒక కొత్త దర్శకుడు డైరెక్షన్ చేస్తున్నట్లు సమాచారం.

Next Story