మహేష్ బాబుపై ఆ రూమర్స్.. నెటిజన్లపై ఫ్యాన్స్ ఫైర్

by Disha Web Desk 10 |
మహేష్ బాబుపై ఆ రూమర్స్.. నెటిజన్లపై ఫ్యాన్స్ ఫైర్
X

దిశ, సినిమా: తెలిసి తెలియక కొంతమంది స్టార్ హీరోలపై తప్పుడు వార్తలు రాస్తుంటారు. అది నిజం అనుకుని చాలామంది భ్రమ పడుతుంటారు. అయితే తాజాగా మహేష్ బాబు గురించి ఒక రూమర్ వినిపిస్తోంది. ఏమీటంటే ‘మహర్షి’ సినిమాలో మండుటెండలో మహేష్ బాబు ఒక సన్నివేశం చేయాల్సి వస్తే, అందుకు మహేష్ ససేమిరా అనడంతో AC సెట్స్ వేసి గేదెలు కూడా అక్కడే సెట్ చేసి ఫైట్ చేయించారట. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఈ సీన్ గురించి వివరిస్తూ కామెంట్లు పెడుతున్నారు ‘‘మహర్షి’ మూవీలో అల్లరి నరేష్‌ను కాపాడే సీన్‌లోనే గేదెలు ఉంటాయి. ఈ సీన్ నైట్ టైం తీశారు ఎండ ఎక్కడ ఉంది’ అంటూ ప్రశ్నిస్తున్నారు. అలాగే ‘ఎండకు భయపడే వాడైతే ‘ఖలేజ’ మూవీలో ఎడారిలో 40 రోజులు ఎండలో ఎలా నటించాడు. ‘టక్కరిలో ఎండకు గుట్టల మధ్య నటించింది కూడా మహేష్ కాదా’ అంటూ ఫైర్ అవుతున్నారు.

Read more:

52 సంవత్సరాల క్రితం 50 దేశాల్లో రిలీజ్ అయిన పాన్ వరల్డ్ తెలుగు సినిమా ఏదో తెలుసా..

Next Story

Most Viewed