52 సంవత్సరాల క్రితం 50 దేశాల్లో రిలీజ్ అయిన పాన్ వరల్డ్ తెలుగు సినిమా ఏదో తెలుసా..?

by Disha Web Desk 12 |
52 సంవత్సరాల క్రితం 50 దేశాల్లో రిలీజ్ అయిన పాన్ వరల్డ్ తెలుగు సినిమా ఏదో తెలుసా..?
X

దిశ, వెబ్‌డెస్క్: సినిమా ఇండస్ట్రీలో నేడు పాన్ ఇండియా సినిమా అని గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ 52 సంవత్సరాల కిందట.. ఓ తెలుగు సినిమా 50 దేశాల్లో పాన్ వరల్డ్ చిత్రంగా రిలీజ్ అయిందంటే నమ్మరేమో కదా.. కానీ అది ముమ్మాటికీ నిజం.. సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల నటించి, నిర్మించిన ఇండియాలో మొట్టమొదటి కౌబాయ్ సినిమా 'మోసగాళ్లకు మోసగాడు'. మొదటి పాన్ ఇండియా సినిమానే కాకుండా, మొదటి పాన్ వరల్డ్ సినిమాగా చరిత్ర సృష్టించింది. కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1971 అగష్ట్ 27 ప్రపంచవ్యాప్తంగా విడుదలై పెద్ద హిట్ కొట్టింది.

'మోసగాళ్లకు మోసగాడు' సినిమాని ఇంగ్లీష్‌లో 'ది ట్రెజర్' (TheTreasure) అనే పేరు మీద విడుదల చేశారు. వాళ్ళకి పాటలు అనవసరం అని తీసేసారు. అలాగే హిందీ, తమిళంలో కూడా డబ్బింగ్ చేసి విడుదల చేశారు. హిందీలో 'ఖజానా' (Khajana) అని పేరు పెట్టారు. అంటే అప్పట్లోనే ఒక తెలుగు సినిమా ఇంతలా పాన్ ఇండియా, పాన్ వరల్డ్ స్థాయిలో తీశారు అంటే నిజంగా కృష్ణ గారు కాబట్టే చేయగలిగారు. అందుకే అయనను సాహసానికి మరో పేరు అంటారు. డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ అని ఆయనొక్కడినే అంటారు.

అయితే ఈ పాన్ వరల్డ్ చిత్రాన్ని ఈ నెల 31వ తేదీన స్వర్గీయ కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా 4కె వర్షన్ లోకి మార్చి రీ రిలీజ్ చేస్తున్నారు. 'మోసగాళ్లకు మోసగాడు' సినిమా 4K వర్షన్ ట్రైలర్‌ను ఆయన కుమారుడు సూపర్ స్టార్ మహేష్ బాబు.. ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. ఈ 'మోసగాళ్లకు మోసగాడు' సినిమా భారత దేశ సినీ చరిత్రలోనే మొట్టమొదటి కౌబాయ్ చిత్రంగా నిలిచిపోయింది. ఈ సినిమాలో జ్యోతిలక్ష్మి, నాగభూషణం, ధూళిపాళ, సత్యనారాయణ, ముక్కామల, రావు గోపాల్ రావు వంటి ప్రముఖ నటులు ఉన్నారు..

Read more:

మహేష్ బాబుపై ఆ రూమర్స్.. నెటిజన్లపై ఫ్యాన్స్ ఫైర్

Next Story