బంపర్ ఆఫర్ అందుకున్న రోషన్‌.. బడా నిర్మాతతో భారీ ప్రాజెక్ట్ కన్ఫర్మ!

by Mallepaka Hamsa |   (  Updated:2025-12-28 07:28:48  IST  )

‘చాంపియన్’ బ్లాక్‌బస్టర్ విజయంతో యంగ్ హీరో రోషన్(Roshan) కెరీర్ కీలక మలుపు తిరిగింది.

బంపర్ ఆఫర్ అందుకున్న రోషన్‌..  బడా నిర్మాతతో భారీ ప్రాజెక్ట్ కన్ఫర్మ!
X

దిశ, సినిమా: ‘చాంపియన్’ బ్లాక్‌బస్టర్ విజయంతో యంగ్ హీరో రోషన్(Roshan) కెరీర్ కీలక మలుపు తిరిగింది. స్వప్న సినిమాస్ సంస్థ భారీ స్థాయిలో నిర్మించిన ఈ స్పోర్ట్స్ డ్రామా భారీ అంచనాలతో విడుదలై, అంచనాలకి మించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ముఖ్యంగా మైఖేల్ పాత్రలో రోషన్ చూపించిన ఫిజికల్ ట్రాన్స్ ఫర్మేషన్, స్క్రీన్ ప్రెజెన్స్‌పై ప్రేక్షకులు, విమర్శకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా గీతా ఆర్ట్స్ అధినేత, అగ్ర నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind) గారు ‘చాంపియన్’(Champion) చిత్రాన్ని వీక్షించి, రోషన్ నటనకు ఎంతగానో ముగ్ధులయ్యారు. ఆయన వ్యక్తిగతంగా రోషన్‌ను అభినందించడమే కాకుండా, తన బ్యానర్‌లో రోషన్‌తో ఒక ప్రాజెక్ట్‌ చేయనున్నారు.

ఈ విషయంపై రోషన్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇది రోషన్ కెరీర్‌లో ఒక మైలురాయి కానుంది. టాలీవుడ్‌లో అగ్ర నిర్మాతల్లో ఒకరైన అల్లు అరవింద్ గారి నుంచి వచ్చిన ఈ అవకాశం గొప్ప గుర్తింపుగా నిలుస్తుందని భావిస్తున్నా అని అన్నారు. కాగా.. ఇప్పటికే ఇండస్ట్రీలో మోస్ట్ ప్రామెసింగ్ యంగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్న రోషన్, నాగ వంశీ గారి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో కూడా ఓ సినిమా చేయనున్నారు. వరుసగా ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలతో అవకాశాలు రావడం రోషన్‌లో ఉన్న ప్రతిభని చాటుతోంది. అతని కెరీర్ వేగంగా ఉన్నత స్థాయికి ఎదుగుతోందని సూచిస్తుంది. ప్రస్తుతం ఈ రెండు వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఇండస్ట్రీ షేక్ అవడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు.

Read More..

స్టార్ డైరెక్టర్‌తో యంగ్ హీరో రోషన్ సినిమా..? బొమ్మ అదిరిపోవాల్సిందే అంటూ కామెంట్స్

Next Story