- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాకింగ్ స్టార్ యష్ షాకింగ్ కామెంట్స్.. ‘KGF-3’ పై ఫ్యాన్స్‌కు క్లారిటీ ఇచ్చిన హీరో!
ప్రస్తుతం నా దృష్టంతా టాక్సిక్, రామాయణ చిత్రాల పైనే ఉంది. అందుకే ఇప్పుడు మరో ప్రాజెక్ట్ గురించి ఆలోచించడం లేదు అని స్పష్టం చేశారు.

దిశ, సినిమా: కన్నడ రాకింగ్ స్టార్ యష్ పేరు వింటేనే బాక్సాఫీస్ రికార్డులు గుర్తుకు వస్తాయి. 'KGF' మూవీతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఆ తర్వాత 'KGF చాప్టర్ 2'తో ఇండియన్ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించారు. ప్రస్తుతం యష్ తన తదుపరి చిత్రాలైన టాక్సిక్, ‘రామాయణ, రామాయణ-2 వంటి భారీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘టాక్సిక్’ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇందులో కియారా అద్వాని, రుక్మిణి వసంత్, తారా సుతారియా వంటి స్టార్ హీరోయిన్లు నటిస్తుండటంతో సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది. నిజానికి ఈ చిత్రం ఉగాది కానుకగా మార్చిలో విడుదల కావాల్సి ఉంది. కానీ, కొన్ని సాంకేతిక కారణాల వల్ల జూన్ 4వ తేదీకి వాయిదా పడింది.
ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో, యష్ ప్రమోషన్స్ పనుల్లో వేగం పెంచారు. తాజాగా.. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న యష్, అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ‘KGF చాప్టర్ 3’ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. "ప్రస్తుతం నా దృష్టంతా టాక్సిక్, రామాయణ చిత్రాల పైనే ఉంది. అందుకే ఇప్పుడు మరో ప్రాజెక్ట్ గురించి ఆలోచించడం లేదు" అని స్పష్టం చేశారు. అయితే, దర్శకుడు ప్రశాంత్ నీల్, తాను ఎప్పుడూ టచ్‌లోనే ఉంటామని.. కథ గురించి చర్చిస్తూనే ఉంటామని తెలిపారు. సరైన కథ కుదిరిన వెంటనే ఖచ్చితంగా KGF-3 ఉంటుందని యష్ హామీ ఇవ్వడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. కానీ కొంత నిరాశకు గురవుతున్నారు. ఈ మూడు ప్రాజెక్ట్స్ అయిపోయాక చేస్తారు కావచ్చని అభిప్రాయపడుతున్నారు.
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫ్యాన్స్‌కు షాకిచ్చిన తారక్!






