ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫ్యాన్స్‌కు షాకిచ్చిన తారక్!

by Mallepaka Hamsa |   (  Updated:2026-04-21 08:59:58  IST  )

ఈ చిత్రాన్ని ఏకంగా ఏడాది పాటు వాయిదా వేస్తూ.. 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫ్యాన్స్‌కు షాకిచ్చిన తారక్!
X

దిశ, సినిమా: యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గురించి వస్తున్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ‘దేవర’ వంటి భారీ విజయం తర్వాత తారక్ చేస్తున్న సినిమా కావడంతో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నందమూరి అభిమానులు ఈ ప్రాజెక్ట్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా విడుదల తేదీపై గత కొంతకాలంగా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొదట సంక్రాంతికి, ఆ తర్వాత 2026 జూన్ 25న విడుదల చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ, తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక పవర్ ఫుల్ పోస్టర్‌ను షేర్ చేస్తూ విడుదల తేదీపై షాకింగ్ క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రాన్ని ఏకంగా ఏడాది పాటు వాయిదా వేస్తూ.. 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, భారీ విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఈ సమయం తీసుకుంటున్నట్లు సమాచారం. ఇంత లాంగ్ గ్యాప్ రావడంతో అభిమానులు కొంత నిరాశ చెందుతున్నా, ప్రశాంత్ నీల్ ఇచ్చే అవుట్‌పుట్ ఆ నిరీక్షణకు తగినట్లుగా ఉంటుందని నమ్ముతున్నారు.

సినిమా లేట్ అవుతున్నా, ఫ్యాన్స్‌ను ఖుషీ చేసేందుకు చిత్ర యూనిట్ ఒక అదిరిపోయే ప్లాన్ చేసింది. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయబోతున్నారు. అదే రోజు అధికారికంగా టైటిల్‌ను కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉందని సమాచారం. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో తారక్ ముఖం కనిపించకుండా షాడో రూపంలో ఉన్న లుక్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. ఈ సినిమాలో తారక్ మునుపెన్నడూ చూడని విధంగా చాలా పవర్‌ఫుల్ బాడీ లాంగ్వేజ్‌తో కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్, టీ-సిరీస్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. ఇందులో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తోంది. ప్రశాంత్ నీల్ గత చిత్రాలైన KGF, సలార్ తరహాలోనే ఈ సినిమాకు కూడా సీక్వెల్స్ ఉండబోతున్నాయని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే తదుపరి షూటింగ్ షెడ్యూల్ కూడా ప్రారంభం కానుంది.

రాకింగ్ స్టార్ యష్ షాకింగ్ కామెంట్స్.. ‘KGF-3’ పై ఫ్యాన్స్‌కు క్లారిటీ ఇచ్చిన హీరో!

Next Story